Telangana Inauguration Day: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు – జనసేనాని
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కాంక్షిస్తున్నానని అన్నారు.

Janasena President (1)
Telangana Inauguration Day: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేశారు. అంతేకాకుండా రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలని కాంక్షిస్తున్నానని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు కోసం ప్రాణ త్యాగం చేసిన వీరులకు అంజలి ఘటించారు.
‘తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అశేష తెలంగాణ ప్రజలందరికీ నా పక్షాన, జనసేన శ్రేణుల పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు. కోట్లాదిమంది తెలంగాణ బిడ్డల ఆశలు… ఆకాంక్షల ప్రతిరూపం తెలంగాణ రాష్ట్రం. వేలాది మంది వీరుల త్యాగ ఫలం తెలంగాణ రాష్ట్రం.
తెలంగాణ ఉజ్వల భవిష్యత్తును కాంక్షిస్తూ ప్రాణాలను త్యాగం చేసిన వీరులందరికీ ఈ సందర్భంగా అంజలి ఘటిస్తున్నాను. తెలంగాణ రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను’ అని జనసేనాని వెల్లడించారు.