తనపై నమోదైన కేసుపై బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్‌ స్పందన

Santosh Kumar: ఫోర్జరీ చేశామని ఫిర్యాదు చేశారని, రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేశారని చెప్పారు.

తనపై నమోదైన కేసుపై బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్‌ స్పందన

Santosh Kumar

హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో తనపై నమోదైన కేసుపై బీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కుమార్‌ స్పందించారు. హైదరాబాద్ షేక్ పేటలోని ఓ ఇంటి స్థలాన్ని తాను శ్యామ్ సుందర్ ఫుల్జాల్ నుంచి కొనుగోలు చేశానని తెలిపారు. అందుకు 2016లో రూ.3.81 కోట్లు చెల్లించానన్నారు.

ఇందులో ఫోర్జరీ ఏమీ జరగలేదని తెలిపారు. ఈ విషయంలో గత ఎనిమిదేళ్లుగా వివాదం లేదని చెప్పారు. తాను కొనుగోలు చేసిన అనంతరం ఆ భూమిలో నిర్మాణాలు కూడా చేపట్టలేదని తెలిపారు. అంతకన్నా ముందు వాళ్లు చేపట్టిన నిర్మాణాలే జరుగుతున్నాయని చెప్పారు.

న్యాయపరమైన అంశాలుంటే ముందుగా తనకు లీగల్ నోటీసు ఇవ్వాలని తెలిపారు. ఫోర్జరీ చేశామని ఫిర్యాదు చేశారని, రాజకీయ దురుద్దేశంతోనే కేసు నమోదు చేశారని చెప్పారు. తాను న్యాయపరంగా దీన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలిపారు. తాను ఎన్నికల అఫిడవిట్లోనూ భూమికి సంబంధించిన వివరాలు ఇచ్చానని అన్నారు.

కాగా, సంతోష్ కుమార్ పై బంజారాహిల్స్ పీఎస్ లో ఇటీవల కేసు నమోదైంది. రోడ్ నెంబర్ 14లో ఉన్న ల్యాండ్ కబ్జాకు యత్నించారని ఫిర్యాదులు వచ్చాయి. నకిలీ డాక్యుమెంట్స్, ఫ్యాబ్రికేటెడ్ డోర్ నెంబర్లను సృష్టించి ల్యాండ్ కబ్జాకు యత్నించారని ఆరోపణలు వచ్చాయి.

Powers Of Enforcement Directorate : ఈడీ ఎవరినైనా అరెస్ట్ చేయొచ్చా? అధికారాలు ఏంటి?