Jubilee Hills By Election: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నికను కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ ఎలాగైనా గెలిచి తీరాలని కాంగ్రెస్ పార్టీ పట్టుదలగా ఉంది. ఈ క్రమంలో జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేదానిపై ఉత్కంఠ నెలకొంది.
బీసీలకు టిక్కెట్ ఇవ్వాలని పీసీసీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. టికెట్ కోసం ఇద్దరి మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. గత ఎన్నికల్లో పోటీ చేసిన అజారుద్దీన్ ని గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ప్రభుత్వం సిఫారసు చేసింది. ఇప్పుడు జూబ్లీహిల్స్ కాంగ్రెస్ టిక్కెట్ రేసులో బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్ పేర్లు వినిపిస్తున్నాయి.
బొంతు రామ్మోహన్, నవీన్ యాదవ్ లలో ఒకరిని అభ్యర్థిగా ఖరారు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
కాగా.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అజారుద్దీన్ తీవ్ర ప్రయత్నాలు చేశారు.
అయితే, అనూహ్యంగా ఆయనను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఖరారు చేయడం కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
సాధారణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ పోటీ చేసి ఓడిపోయారు. అక్కడ మాగంటి గోపీనాథ్ గెలిచారు.
ఇటీవలే ఆయన మరణించారు. దాంతో జూబ్లీహిల్స్ లో ఉపఎన్నిక అనివార్యమైంది.
సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఓటమి పాలైన అజారుద్దీన్.. ఉపఎన్నికలోనూ మరోసారి కాంగ్రెస్ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేశారు.
Also Read: లోకల్ బాడీ ఎన్నికలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్.. స్పెషల్ జీవోతో రిజర్వేషన్ క్యాప్ ఎత్తివేత..!