Local Body Elections: లోకల్ బాడీ ఎన్నికలకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్.. స్పెషల్ జీవోతో రిజర్వేషన్ క్యాప్ ఎత్తివేత..!
కచ్చితంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఏ విధంగా ముందుకెళ్లాలి అనేదానిపై చర్చించారు. (Local Body Elections)

Local Body Elections: స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతున్న తెలంగాణ సర్కార్ స్పెషల్ జీవోతో రిజర్వేషన్ క్యాప్ ఎత్తివేసేందుకు క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణ ఎన్నికల కమిషన్ కి లేఖ రాసింది ప్రభుత్వం. సెప్టెంబర్ లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని లేఖలో కోరింది.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని గతంలోనే హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. సెప్టెంబర్ 30లోపు పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
దీనిపై సుదీర్ఘంగా కసరత్తు చేస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు ఉద్యోగాలు, విద్యలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ రేవంత్ సర్కార్ బిల్లు తీసుకొచ్చింది. ఆ బిల్లు ప్రస్తుతం కేంద్రం దగ్గర పెండింగ్ లో ఉంది.
కచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే ఉద్దేశంతో దీనిపై క్యాబినెట్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. కచ్చితంగా 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఏ విధంగా ముందుకెళ్లాలి అనేదానిపై చర్చించారు.
స్పెషల్ జీవో ఇచ్చి కచ్చితంగా రిజర్వేషన్లు అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
లోకల్ బాడీ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వం లేఖ రాసింది.
ఎన్నికల నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలంటూ లేఖలో కోరింది. ఈ లేఖ నేపథ్యంలో సెప్టెంబర్ 30లోపు కచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని భావించొచ్చు.
సెప్టెంబర్ మొదటి వారం ఎండింగ్ లోపు ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రాబోతోంది.
పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే వార్డులు, గ్రామ పంచాయతీ సర్పంచ్ లకు సంబంధించిన సంఖ్యను ఇప్పటికే నిర్ణయించారు.
క్యాబినెట్ లోనూ వాటి వివరాలు పొందుపరిచినట్లు సమాచారం. సంబంధిత శాఖ మంత్రి సీతక్క వాటి వివరాలను మంత్రివర్గం ముందుకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
తెలంగాణ వ్యాప్తంగా గ్రామ పంచాయతీలు, వార్డులకు సంబంధించిన మొత్తం వివరాలను ప్రభుత్వానికి అందించారు.
Also Read: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అజారుద్దీన్.. క్యాబినెట్ కీలక నిర్ణయం..