Mlcs: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అజారుద్దీన్.. క్యాబినెట్ కీలక నిర్ణయం..

ఈ మేరకు వారిద్దరి పేర్లను గవర్నర్ కు సిఫార్సు చేసింది ప్రభుత్వం.

Mlcs: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అజారుద్దీన్.. క్యాబినెట్ కీలక నిర్ణయం..

Updated On : August 30, 2025 / 4:17 PM IST

Mlcs: తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరామ్, అజారుద్దీన్ లను ఖరారు చేసింది. ఈ మేరకు వారిద్దరి పేర్లను గవర్నర్ కు సిఫార్సు చేసింది ప్రభుత్వం. సుప్రీంకోర్టు తీర్పుతో క్యాబినెట్ మరోసారి గవర్నర్ కోటా ఎమ్మెల్సీల పేర్లను సిఫారసు చేసింది.

అయితే కోదండరామ్ కు మరోసారి అవకాశం ఇచ్చిన రేవంత్ సర్కార్.. అజారుద్దీన్ పేరును అనూహ్యంగా తెర‌పైకి తీసుకొచ్చింది. గ‌తంలో సిఫార‌సు చేసిన అమీర్ అలీ ఖాన్ స్థానంలో అజారుద్దీన్‌కు చోటు ల‌భించింది.

కాగా, ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్‌‌‌ అలీఖాన్‌‌‌ ల‌ నియామకాన్ని సవాల్ చేస్తూ బీఆర్‌‌‌‌ఎస్‌‌‌‌ నేతలు దాసోజు శ్రవణ్, సత్యనారాయణలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు వారి నియామకంపై స్టే విధించింది.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసేందుకు అజారుద్దీన్ తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌నను ఎమ్మెల్సీగా ఎంపిక చేయ‌డం రాజ‌కీయ వ‌ర్గాల్లో ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్ త‌ర‌పున జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌ల బ‌రిలో అభ్యర్థి ఎవరు అనే అంశంపై ఇంట్రస్టింగ్ మారింది.

గవర్నర్ కోటా ఎమ్మెల్సీలకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు నడుస్తోంది. కోదండరామ్, అమీర్ అలీఖాన్ ల నియామకంపై స్టే విధించింది. ఆ తర్వాత వారి నియామకాలను రద్దు చేసింది. దీనిపై తాజాగా నోటిఫికేషన్ ఇచ్చి నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు క్యాబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ కోటాకు సంబంధించి క్యాబినెట్ చేసే సిఫారసులనే ఆమోదించాల్సి ఉంటుంది. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరామ్, అజారుద్దీన్ ల పేర్లను ఖరారు చేసింది. అమీర్ ఖాన్ ప్లేస్ లో అజారుద్దీన్ పేరుని తెరపైకి తేవడం కాంగ్రెస్ వర్గాల్లో ఇంట్రస్టింగ్ పాయింట్.

సాధారణ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా అజారుద్దీన్ పోటీ చేశారు. ఇప్పుడు మరోసారి ఉపఎన్నికలోనూ టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అజారుద్దీన్ కు ఎమ్మెల్సీగా ఛాన్స్ కల్పించడం జూబ్లీహిల్స్ విషయంలో అజారుద్దీన్ ను పక్కన పెట్టినట్లుగా భావించాల్సి ఉంటుంది. అజారుద్దీన్ స్థానంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కొత్త అభ్యర్థిని బరిలోకి దింపాలని కాంగ్రెస్ చూస్తోంది.

Also Read: అసెంబ్లీలో పీపీటీ పంచాయితీ.. బీఆర్ఎస్‌కు భట్టి విక్రమార్క స్ట్రాంగ్ కౌంటర్.. అప్పుడో విధానం.. ఇప్పుడో విధానమా..?