Jubilee Hills Bypoll: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజక వర్గంతో పాటు దేశంలో ఖాళీగా ఉన్న పలు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల షెడ్యూల్ మూడు-నాలుగు రోజుల్లో విడుదల అయ్యే అవకాశం ఉంది.
కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇవాళ, రేపు బిహార్‌లో పర్యటించనున్నారు. అక్టోబర్ 6 లేదా 7న బిహార్ ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉంది. 2025 నవంబర్ 22 నాటికి బిహార్‌లో ప్రస్తుత అసెంబ్లీ రద్దు కానుంది.
కొత్త అసెంబ్లీ, ప్రభుత్వం ఏర్పాటు కావాలంటే మరో 52 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. బిహార్‌లో 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రెండు దశలో బిహార్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
Also Read: రాహుల్ గాంధీ కూడా రక్షించలేరు.. తెలంగాణలో రేవంత్ రెడ్డిని ఓడిస్తా: ప్రశాంత్ కిశోర్ ప్రతిజ్ఞ
ఛత్ పండుగ తర్వాత తొలి దశ ఎన్నికలు ఉండొచ్చు. అక్టోబర్ 28న ఛత్ పండుగ ఉంది. అక్టోబర్ 31 నుంచి నవంబర్ 2 మధ్యలో తొలి దశ, నవంబర్ 5 నుంచి 7 మధ్య రెండో దశ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
నవంబర్ 10న ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. బిహార్ ఎన్నికలతో పాటు దేశవ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి తెలంగాణలోని జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తేదీని కూడా ఈసీ ప్రకటించనుంది.