Julakanti Ranga Reddy On Congress : బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడించడం కోసం అందరూ కలిసికట్టుగా పని చేయాలి సీపీఎం మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి పిలుపునిచ్చారు. ఇక, టికెట్ల కేటాయింపు విషయంలో రెండు జాతీయ పార్టీల అగ్రనేతలు మాట్లాడుకుంటున్నారే తప్పా.. సీట్ల కేటాయింపు జరగడం లేదన్నారు. కావాలనే కొందరు కాంగ్రెస్ నాయకులు మిర్యాలగూడలో సీపీఎంపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఇది కరెక్ట్ కాదని ఆయన అన్నారు. కాంగ్రెస్ నాయకులు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు జూలకంటి రంగారెడ్డి.
సీట్ల విషయంలో ఎవరి పార్టీ వారి నాయకులతో మాట్లాడుకోవాలి తప్ప మిగతా పార్టీలపై విమర్శలు చేయడం సరికాదని హితవు పలికారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి నాయకుడు కూడా వామపక్షాల పొత్తులపై అలా మాట్లాడటం సరైన పద్ధతి కాదన్నారు జూలకంటి రంగారెడ్డి. సీట్ల విషయంలో మేము కేవలం నాలుగే కోరుకుంటున్నాము, మిగతా 100 స్థానాల్లో కాంగ్రెస్ కు మద్దతిస్తున్నాం అని స్పష్టం చేశారు.
Also Read : కేసీఆర్ రాకతో షబ్బీర్ అలీ వెనకడుగు.. కామారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆయనేనా?
మాకు సీట్లు, పదవులు ముఖ్యం కాదన్న జూలకంటి రంగారెడ్డి ప్రజా సమస్యలపైనే మా పోరాటం అని తేల్చి చెప్పారు. మిర్యాలగూడలో కాంగ్రెస్ నాయకులు సీపీఎంపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలని జూలకంటి రంగారెడ్డి హితవు చెప్పారు.
Also Read : కాంగ్రెస్ ఫస్ట్ లిస్టులో రేవంత్ మనుషులకే ఎక్కువ టికెట్లు దక్కాయా?