Ration Card eKYC: రేషన్ కార్డుదారులకు బిగ్ అలర్ట్.. పది రోజులే గడువు.. లేదంటే రేషన్ కార్డు క్యాన్సిల్
రేషన్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టి, నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం ఇ-కేవైసీ(Ration Card e-KYC) ప్రక్రియను చేపట్టింది.
July 31 Deadline to complete Ration Card E KYC in telangana
- జూలై ముప్పైఒకటి చివరి తేదీ
- ప్రతి సభ్యుడికీ బయోమెట్రిక్ తప్పనిసరి
- ఉచితంగానే ఇ-కేవైసీ ప్రక్రియ
Ration Card 3-KYC: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు పౌర సరఫరాల శాఖ కీలక సూచన చేసింది. రేషన్ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టి, నిజమైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందించేందుకు ప్రభుత్వం ఇ-కేవైసీ (Ration Card eKYC) ప్రక్రియను చేపట్టింది. ఈ ప్రక్రియను పూర్తి చేయడానికి జూలై 31ని చివరి తేదీగా నిర్ణయించారు. ఈ గడువులోగా ఇ-కేవైసీ పూర్తి చేయని కుటుంబాలకు భవిష్యత్తులో రాయితీ రేషన్తో పాటు ఆహార భద్రతా కార్డు (FSC) ద్వారా అందే పలు ప్రభుత్వ ప్రయోజనాలు నిలిచిపోయే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Also Read: మందుబాబులకు పోలీసుల హెచ్చరిక.. దొరికితే 10 ఏళ్ల జైలు శిక్షే.. ఇవి కూడా తెలుసుకోండి!
కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికీ బయోమెట్రిక్ తప్పనిసరి:
పౌర సరఫరాల శాఖ నిబంధనల ప్రకారం.. రేషన్ కార్డులో నమోదైన ప్రతి కుటుంబ సభ్యుడు తప్పనిసరిగా బయోమెట్రిక్ (వేలిముద్ర) లేదా ఐరిస్ స్కాన్ ద్వారా ధృవీకరణ పూర్తి చేయాలి. కుటుంబంలో కేవలం ఒక్కరు మాత్రమే ఇ-కేవైసీ పూర్తి చేస్తే సరిపోదని, కార్డులో పేర్లు ఉన్న సభ్యులందరి వివరాలను విడివిడిగా ధృవీకరించాల్సి ఉంటుందని అధికారులు స్పష్టం చేశారు. ఇందుకోసం లబ్ధిదారులు తమ ఒరిజినల్ రేషన్ కార్డుతో పాటు, కుటుంబ సభ్యులందరి ఒరిజినల్ ఆధార్ కార్డులను వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది.
మీసేవ, రేషన్ షాపుల్లో ఉచితంగానే ప్రక్రియ:
ఈ ఇ-కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలనుకునే వారు తమ స్థానిక రేషన్ దుకాణం లేదా సమీపంలోని మీసేవా కేంద్రాన్ని సందర్శించవచ్చు. ఈ సేవలు పూర్తిగా ఉచితం అని, లబ్ధిదారులు ఎవరికీ ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒకవేళ ఇ-కేవైసీ పేరుతో ఎవరైనా డబ్బులు డిమాండ్ చేస్తే వెంటనే అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. గడువు ముగిసిన తర్వాత రేషన్ సరఫరాలో అంతరాయం కలగకుండా ఉండాలంటే వీలైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
