TG Junior Doctors : రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు సమ్మెబాట.. ప్రధాన డిమాండ్లు ఇవే..

జూనియర్ డాక్టర్లు సమ్మెకు సిద్ధమయ్యారు. ఇవాళ్టి నుంచి విధులను బహిష్కరించాలని నిర్ణయించారు. ఉపకార వేతనాలు సకాలంలో చెల్లించాలని ..

TG Junior Doctors : రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు సమ్మెబాట.. ప్రధాన డిమాండ్లు ఇవే..

junior doctors strike (Credit_Google)

Junior Doctors Strike : జూనియర్ డాక్టర్లు సమ్మెకు సిద్ధమయ్యారు. ఇవాళ్టి నుంచి విధులను బహిష్కరించాలని నిర్ణయించారు. ఉపకార వేతనాలు సకాలంలో చెల్లించాలని వారంరోజులుగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఉస్మానియా హాస్పిటల్ లో రెండు రోజులుగా కళ్లకు గంతలు కట్టుకుని జూడాలు నిరసన తెలిపారు. అయితే, సమస్య పరిష్కారానికి సమయం కావాలని వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కోరారు. అయినా, ఇవాళ్టి నుంచి విధులను బహిష్కరించాలని జూడాల నిర్ణయించారు. జూడాల సమ్మెకు దిగితే గాంధీ, ఉస్మానియా, నీలోఫర్, ఫీవర్ ఆస్పత్రుల్లో రోగులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది.

Also Read : మా వాటా మాకివ్వాల్సిందే..! కొనసాగుతున్న ఢిల్లీ మంత్రి అతిశీ నిరాహార దీక్ష

ఉపకార వేతనాలు సకాలంలో చెల్లించాలని జూనియర్ డాక్టర్లు డిమాండ్ చేశారు. సూపర్ స్పెషాలిటీ పూర్తయిన పీజీలకు ఖచ్చితంగా ప్రభుత్వ సర్వీస్ అనిపెట్టి నెలకు రూ. 2.5లక్షలు ఇస్తామనని చెప్పారు. కానీ, ఇప్పుడు రూ. 92వేలు ఇస్తాం అంటున్నారని జూడాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : నెల రోజుల్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం..!

జూడాల డిమాండ్లు ఇవే..
ఉపకార వేతనాలు సకాలంలో అందాలి.
ఉస్మానియా కొత్త బిల్డింగ్ కట్టాలి.
డాక్టర్లపై దాడులను ఆపాలి.
కాకతీయ మెడికల్ కాలేజీలో రోడ్లు నిర్మాణం జరగాలి.
ప్రభుత్వ హాస్పిటల్లో మౌలిక వసతులు కల్పించాలి.