ka paul : మమ్మల్ని చంపడానికి పోలీసులు వచ్చారు : కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు
మమ్మల్ని చంపటానికి పోలీసులు వచ్చారు. సదశివా పేట్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి సివిల్ డ్రెస్ లో వచ్చారు.

KA Paul sensational allegations
ka paul : మమ్మల్ని చంపడానికి కొంతమంది పోలీసులు వచ్చారు అంటూ ప్రజా శాంతి పార్టీ అధ్యక్షులు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 23న మమ్మల్ని చంపటానికి వచ్చిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఫిర్యాదు చేసాం అని తెలిపారు.సదశివా పేట్ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, మహిళా సబ్ ఇన్స్పెక్టర్ లక్ష్మి సివిల్ డ్రెస్ లో వచ్చి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేశారు అంటూ కేఏ పాల్ సంచలన ఆరోపణలు చేశారు.
పోలీస్ అధికారులు సివిల్ డ్రెస్ లో వచ్చి మమ్మల్ని భయబ్రాంతులకు గురి చేశారని..ఈ విషయంపై డీజీపీ అంజనీ కుమార్ ను కలిసి ఫిర్యాదు చేసామని తెలిపారు. మేం చేసిన ఫిర్యాదుపై డీజీపీ సానుకూలంగా స్పందించారని తెలిపారు. మీ ఫిర్యాదు మేరకు విచారించి చర్యలు తీసుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.
అధికార పార్టీ నేతలు గుండా గిరి చేస్తున్నారు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తున్నారు అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జానకీపురం మహిళ సర్పంచ్ నవ్య ఉదంతాన్ని గుర్తు చేశారు. అలా మహిళలను వేధిస్తున్న నేతలను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పాల్ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.ఎమ్మెల్యే రాజయ్య, దుర్గం చెన్నైయ్య, పాడి కౌశిక్ రెడ్డి లను పార్టీ నుండి సస్పెండ్ చెయ్యాలని డిమాండ్ చేశారు.రానున్న ఎన్నికల్లో BRS పార్టీ కి ప్రజలు బుద్ది చెపుతారని అన్నారు.