నన్ను హత్య చేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. హత్య జరిగితే ఆయనదే బాధ్యత: కౌశిక్ రెడ్డి

స్వయంగా ముఖ్యమంత్రే బహిరంగంగా తమ ఇంటికి అరెకపూడి గాంధీని సహా గూండాలను పంపించినట్లు చెప్పారని అన్నారు.

Kaushik Reddy: హామీలపై తాను నిలదిస్తే తనను హత్య చేసే ప్రయత్నాలు మొదలుపెట్టారా అంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నిలదీశారు. తనను హత్య చేస్తామని రోజు బెదిరింపు కాల్స్ రోజు వస్తున్నాయని, తన హత్య జరిగితే రేవంత్ రెడ్డిదే బాధ్యతని తెలిపారు.

స్వయంగా ముఖ్యమంత్రే బహిరంగంగా తమ ఇంటికి అరెకపూడి గాంధీని సహా గూండాలను పంపించినట్లు చెప్పారని అన్నారు. సీఎం వ్యాఖ్యను సుమోటోగా తీసుకుని హత్యాయత్నం కేసు నమోదు చేయాలని చెప్పారు. సైబరాబాద్ సీపీ సమర్థవంతంగా పనిచేయడం లేదని ఆరోపించారు. ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగినా సీపీ పట్టించుకోవడం లేదని అన్నారు.

తెలంగాణ ప్రజలు రేవంత్ రెడ్డి వీపుని చింతపండు చేస్తారని చెప్పారు. తాను తెలంగాణ ప్రజల కోసం చచ్చేందుకు రెడీ అని అన్నారు. రేవంత్ రెడ్డి తన కంటే కింది స్థాయికి దిగజారి పోయారని చెప్పారు. తిరుపతి రెడ్డికి హైడ్రా నోటీసులు ఇచ్చినప్పటికీ ఇంకా ఆయన భవనాన్ని ఎందుకు కూలగొట్టడం లేదని ప్రశ్నించారు. పేదల ఇళ్లను కలగొట్టేందుకు కనీసం నోటీసులు ఇవ్వలేదని అన్నారు.

Minister Narayana: అక్కడ ఎలాంటి వరద ప్రమాదమూ లేదు: మంత్రి నారాయణ