Minister Narayana: అక్కడ ఎలాంటి వరద ప్రమాదమూ లేదు: మంత్రి నారాయణ

వచ్చే వర్షాకాలంలోపు పూర్తి చేస్తామని అన్నారు. ఇవి‌ పూర్తయితే అమరావతి రాజధానికి..

Minister Narayana: అక్కడ ఎలాంటి వరద ప్రమాదమూ లేదు: మంత్రి నారాయణ

Updated On : September 16, 2024 / 3:36 PM IST

రాజధాని అమరావతికి 217 చదరపు కిలో మీటర్ల వరకు ఎలాంటి వరద ప్రమాదం లేదని ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణా నది వరదల నుంచి కాపాడేందుకు పాలవాగు, గ్రావిటీ‌ కెనాల్, కొండవీటి వాగును డిజైన్ చేసినట్లు తెలిపారు.

వచ్చే వర్షాకాలంలోపు పూర్తి చేస్తామని అన్నారు. ఇవి‌ పూర్తయితే అమరావతి రాజధానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్పారు. ఎంత నీరు వచ్చినా తొవ్విన కెనాల్స్ లోనే ఇబ్బందులు లేకుండా స్టోర్ అవుతాయని అన్నారు. వీటితో పాటు రాజధానిలో మూడు రిజర్వాయర్లను ప్లాన్ చేశామని తెలిపారు. కెనాల్స్ లో స్టోర్ నిండితే రిజర్వాయర్లలో నింపుతామని చెప్పారు.

అమరావతి సేఫెస్ట్ ప్లేస్ అని, ఎవరేమి చెప్పినా నమ్మవద్దని అన్నారు. కరకట్ట‌ ఫోర్‌లైన్ గా‌ డిజైన్ చేశామని, అవసరమైతే రీ‌డిజైన్‌ చేస్తామని, వెంటనే టెండర్లు పిలుస్తామని చెప్పారు. కృష్ణానదిలోకి 15 వేల‌ క్యూసెక్కుల నీరు వచ్చిన ఇబ్బందులు లేకుండా డిజైన్ చేస్తామని తెలిపారు. ఐకానిక్ బిల్డింగుల నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బందులు లేవని రిపోర్ట్ ఇచ్చారని తెలిపారు. బుడమేరు వరద ఉద్ధృతికి ఎంతో మంది ప్రజలు ఇబ్బంది పడ్డారని చెప్పారు.

రాజధాని ప్రాంతం మునిగిపోయిందని వైసీపీ అసత్య ప్రచారాలు చేసిందని అన్నారు. రాజధాని పరిసర ప్రాంతాలకి ఎలాంటి ముప్పు లేదని, రాజధాని నిర్మాణానికి ఇలాంటి ఇబ్బందులు తలేత్తకుండా మూడు వాగులని స్టోరేజ్ కెపాసిటీ పెంచుతున్నామని తెలిపారు. రైతులకి కౌలు చెల్లింపు అనేది ఒకటి క్లియర్ చేశామని, ల్యాండ్ పూలింగ్ పై డౌట్స్ ఉన్నాయని రైతులు అడిగారని అన్నారు. వాటిపై స్పష్టత వస్తే భూములు ఇవ్వటానికి ముందుకి వస్తామని రైతులు చెప్పినట్లు తెలిపారు. ఏపీలోనూ హైడ్రా తరహా వ్యవస్థ తీసుకొస్తామని, ఆక్రమణలను ఉపేక్షించబోమని తెలిపారు.

Crime News: భార్యను ఆమె పుట్టింటి నుంచి తీసుకెళ్లి కొట్టి చంపిన భర్త.. ఎందుకంటే?