MLC Kavitha
కన్‌ఫ్యూజన్స్ వీడుతున్నాయ్. అన్నాచెల్లెల్ల మధ్య వైరం పీక్ లెవల్‌కు చేరుకున్నట్లే కనిపిస్తోంది. పార్టీతో ఆమె బంధం కూడా తెగినట్లేనన్న టాక్ కూడా వినిపిస్తోంది. బీఆర్ఎస్ తీరుపై డైరెక్ట్‌గానే అటాక్ చేస్తున్నారు ఎమ్మెల్సీ కవిత. పైగా కారు పార్టే తన లైన్‌లోకి రావాల్సిందే అంటున్నారు. అంటే కారు దిగాలని కవిత ఫిక్స్ అయిపోయారా.? ఇక సస్పెన్స్‌లు, వేచి చూడడాలేమ్ ఉండవా.? అంటే ప్రజెంట్ సిచ్యవేషన్ చూస్తుంటే..కవిత సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది.
ఆమె గులాబీ పార్టీకి రాంరాం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయంటున్నారు. ఇదే సమయంలో కవిత, కేటీఆర్ మధ్య కోల్డ్ వార్ కాస్త..డైరెక్ట్ వార్‌గానే కనిపిస్తోంది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలిగా ఎమ్మెల్సీ కవిత కొనసాగుతున్నారు. ఉద్యమసయమంలో ఈ సంఘానికి హరీష్ రావు గౌరవాధ్యక్షుడిగా ఉంటే..అధికారంలోకి వచ్చాక ఈ సంఘం కవిత చేతుల్లోకి వచ్చింది. ఇప్పుడు ఆమె నుంచి ఆ బాధ్యతలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత కొప్పుల ఈశ్వర్‌కు అప్పగించారు కేటీఆర్. దీంతో కవితకు కేటీఆర్ షాక్ ఇచ్చారనే టాక్ మొదలైంది. తెల్లారే మీడియాతో చిట్‌చాట్‌లో..బీఆర్ఎస్‌పై డైరెక్ట్‌గానే అటాక్ చేశారు కవిత.
సొంత పార్టీని ఇరుకున పెట్టేలా కామెంట్స్
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంత పార్టీని ఇరుకున పెట్టేలా చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. రేవంత్ ప్రభుత్వం స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం తెచ్చిన ఆర్డినెన్స్‌ను సమర్థించారు. ఆర్డినెన్స్ సరైనదే, బీఆర్‌ఎస్ లీడర్లు వ్యతిరేకించడం తగదంటున్న ఆమె..బీఆర్‌ఎస్ వాళ్లు తనదారికి రావాల్సిందే..అందుకు కాస్త టైమ్ పడుతుందంతే అంటున్నారు. మొన్నటివరకు పార్టీనే తనదని..బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నానని చెప్పిన కవిత..ఇప్పుడు ఏకంగా పార్టీనే తనదారిలోకి రావాల్సిందేనని కామెంట్ చేయడంపై ఆసక్తికర చర్చే జరుగుతోంది.
తీన్మార్ మల్లన్న తనపై చేసిన కామెంట్స్‌పై బీఆర్ఎస్ రియాక్ట్ కాకపోవడంపై కూడా కవిత తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ లీడర్లు రియాక్ట్ కాకపోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నానన్నారు. అలా TBGKS ఇంచార్జ్‌గా కొప్పుల నియామకం..తెల్లారే కవిత కామెంట్స్ చూస్తుంటే..కేటీఆర్ కవిత మధ్య పెద్ద గ్యాపే ఉందన్న చర్చ జరుగుతోంది. అందుకే బీఆర్ఎస్‌లో, ఆ పార్టీ అనుబంధ సంఘాల్లో కవిత ప్రాధాన్యతను తగ్గిస్తున్నారనే టాక్ వినిపిస్తోంది.
Also Read: కేంద్రమంత్రిగా నాగబాబు? టీడీపీ నుంచి ఎవరు?
కవిత కూడా కన్‌ఫ్యూజన్ వీడి..పొలిటికల్ ఫ్యూచర్‌పై క్లారిటీకి వచ్చారని అంటున్నారు. జాగృతి పేరుతో యాక్టివిటీని ఇంకా స్పీడప్ చేయాలని ఫిక్స్ అయ్యారట. ఈ క్రమంలో బీఆర్ఎస్‌కు రాజీనామా చేయాలనే ఆలోచనకు ఆమె వచ్చినట్లు ఇన్ సైడ్ టాక్. అయితే ఏ పార్టీలోకి వెళ్లకుండా..వచ్చే ఎన్నికల నాటికి సొంతంగా బలపడాలనేది కవిత ఆలోచన అంటున్నారు. అప్పుడు బీఆర్ఎస్సే ఓ మెట్టు దిగి వస్తుందని..తన డిమాండ్లు ఏవైనా ఉంటే అప్పుడు సాధించుకోవచ్చని భావిస్తున్నారట.
అందుకే బీఆర్ఎస్సే తనదారిలోకి రావాలని అంటున్నారట కవిత. అయితే ఆమె కాంగ్రెస్‌తో టచ్‌లో ఉన్నారని టాక్ నడిపిస్తున్నప్పటికీ ఈ విషయంపై మాత్రం కవిత క్లారిటీ ఇవ్వడం లేదు. ఇవేవి పట్టించుకోకుండా..తాను లైమ్‌లైట్‌లో ఉంటూ..తన చుట్టూనే చర్చ జరిగేలా స్కెచ్ వేస్తున్నారు కవిత. టైమ్ చూసి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేస్తూ న్యూస్ హెడ్‌లైన్‌గా మారుతున్నారు.
అయితే కవిత కారు దిగడం పక్కా అని అంటున్నారు. మరి కారు దిగితే కాంగ్రెస్ గూటికా? సొంత కుంపటా అనేది క్లారిటీ లేదు. బట్ తెలంగాణ పాలిటిక్స్‌లో తానూ ఒక స్ట్రాంగ్ ఫోర్స్‌గా ఉండాలనేది కవిత పట్టుదలగా చెబుతున్నారు. ఆమె రాజకీయ వ్యూహాలు ఎలా ఉండబోతున్నాయో చూడాలి మరి. మరోవైపు కేసీఆర్ కూడా ఈ అంశంపై తాడోపేడో తేల్చేయాలనే ఆలోచనలోనే ఉన్నారనే టాక్ నడుస్తోంది. ఎవరు ముందు డెసిషన్ తీసుకుంటారో చూడాలి మరి.