Farm loan waiver: రైతుల‌కు కేసీఆర్ స‌ర్కార్ శుభవార్త.. రూ.ల‌క్షలోపు రుణాలు మాఫీ

ఇందుకుగానూ రూ.6,546 కోట్ల‌ను విడుద‌ల చేసింది. 2018 డిసెంబ‌రు 11 నాటికి ఉన్న రూ.ల‌క్ష లోపు రుణాలను మాఫీ చేసింది.

Farm loan waiver: రైతుల‌కు కేసీఆర్ స‌ర్కార్ శుభవార్త.. రూ.ల‌క్షలోపు రుణాలు మాఫీ

CM KCR

Updated On : August 14, 2023 / 8:43 PM IST

Farm loan waiver – KCR: రైతుల‌కు సీఎం కేసీఆర్ స‌ర్కార్ శుభవార్త తెలిపింది. రూ.ల‌క్షలోపు రుణాలను మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ రుణాల‌ను మాఫీ చేస్తూ ఉత్వ‌ర్వులు జారీ చేసింది. సోమ‌వారం 10,79,721 మంది రైతుల‌కు రుణ‌మాఫీ చేసింది.

ఇందుకుగానూ రూ.6,546 కోట్ల‌ను విడుద‌ల చేసింది. 2018 డిసెంబ‌రు 11 నాటికి ఉన్న రూ.ల‌క్ష లోపు రుణాలను మాఫీ చేసింది. 2018 అసెంబ్లీ ఎన్నిక‌ల హామీని అమలు చేసేందుకు గానూ సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకన్నారు. ఇప్పటికే రూ.50 వేలలోపు రుణాలు ఉన్న 7,19,488 మంది రైతుల రుణాలను మాఫీ చేసిన విషయం తెలిసిందే.

కాగా, రుణమాఫీ విషయంలో కేసీఆర్ హామీని నిలబెట్టుకోవడం లేదని చాలా కాలంగా ప్రతిపక్ష పార్టీలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. మరో మూడు నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో రుణ మాఫీ చేయడం గమనార్హం.

Chandrababu Naidu: తహసీల్దార్ ఆఫీసులోకి వేలాది గొర్రెలను తోలి.. కాపరులు నిరసనకు దిగాల్సి వచ్చింది: వీడియో పోస్ట్ చేసిన చంద్రబాబు