Malla Reddy Hot Comments : కాబోయే ప్రధాని కేసీఆర్, బీజేపీ తుడిచిపెట్టుకుపోతుంది- మంత్రి జోస్యం

విజయదశమి రోజున వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కేసీఆర్ తన భవిష్యత్తు కార్యాచరణ మొదలుపెడతారని, దేశ రాజకీయాల కోసం బయలుదేరుతారని చెప్పారు.

Malla Reddy Hot Comments : దేశ రాజకీయాల్లో త్వరలో సంచలనాలు చూడబోతున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ పదే పదే చెబుతున్న వేళ మంత్రి మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దేశానికి కాబోయే ప్రధాని కేసీఆరే అంటూ కామెంట్ చేశారు. విజయదశమి రోజున వరంగల్ భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత కేసీఆర్ తన భవిష్యత్తు కార్యాచరణ మొదలుపెడతారని, దేశ రాజకీయాల కోసం బయలుదేరుతారని మంత్రి చెప్పారు. కేసీఆర్ దేశ్ కీ నేత అని, ఆయనే ప్రధాని కావాలని భద్రకాళి అమ్మవారికి మొక్కినట్లు చెప్పారు మంత్రి మల్లారెడ్డి. కేసీఆర్ కు టీఆర్ఎస్ నుంచి పూర్తి మద్దతు ప్రకటించామన్నారు. త్వరలోనే బీజేపీ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అని మంత్రి మల్లారెడ్డి అన్నారు.

PM Narendra Modi : కుటుంబ పాలన అంటూ సీఎం కేసీఆర్ పై ప్రధాని మోడీ ఘాటు విమర్శలు..

”దసరా నుంచి కేసీఆర్ కొత్త రాజకీయం చూస్తారు. విజయదశమి రోజున భద్రకాళిని దర్శించుకుని కేసీఆర్ కార్యాచరణ ప్రకటిస్తారు. కేసీఆర్ దేశంలో చక్రం తిప్పుతారు. ప్రధాని అవుతారు. కేసీఆర్ ప్రధాని కావాలని భద్రకాళికి మొక్కాను. కేసీఆర్ దేశ్ కీ నేత. ఆయనే ప్రధాని కావాలి. భవిష్యత్తులో బీజేపీ తుడిచిపెట్టుకుకోవడం ఖాయం” అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. వరంగల్ పర్యటనలో మంత్రి మల్లారెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

బీజేపీ అంటేనే జూటా పార్టీ అని, దేశాన్ని బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తోందని మంత్రి మల్లారెడ్డి ఫైర్ అయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ పాలిత రాష్ట్రాలకు ఆయన సవాల్‌ విసిరారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు అమలు చేస్తే.. తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని అన్నారు. తెలంగాణను బీట్‌ చేసే మగాడు ఎవరూ లేరని మల్లారెడ్డి అన్నారు. కేసీఆర్ కు ప్రజలు సంపూర్ణ మద్దతివ్వాలన్నారు. బీజేపీ కౌరవుల నుంచి దేశానికి విముక్తి కల్పించాలని.. కేసీఆర్‌ను ప్రధానిని చేయాలని భద్రకాళిని ప్రార్థించానన్నారు.

PM Narendra Modi : కుటుంబ పాలన అంటూ సీఎం కేసీఆర్ పై ప్రధాని మోడీ ఘాటు విమర్శలు..

వచ్చే ఎన్నికల తర్వాత దేశంలో కేసీఆర్ ప్రభుత్వమే రాబోతోందని మల్లారెడ్డి జోస్యం చెప్పారు. వరంగల్ భద్రకాళి ఆశీర్వాదంతో కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి బయల్దేరతారని అన్నారు. కాంగ్రెస్ ఇప్పటికే దివాళా తీసిందని.. ఇప్పుడు బీజేపీ దివాళా తీయబోతోందని ఆయన హాట్ కామెంట్స్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు