KCR (Image Credit To Original Source)
KCR: సార్ సభకు వస్తారా రారా. అటు బీఆర్ఎస్‌లో..ఇటు కాంగ్రెస్‌లో ఇదే చర్చ. గులాబీ దళపతి మాత్రం సభకు వస్తా..అధికార పార్టీకి ఇచ్చిపడేస్తానంటున్నారు. కారు పార్టీ లీడర్లు మాత్రం కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారట.
సార్ సభకు వస్తే..అధికార పార్టీ నేతలు ఆయనను పర్సనల్‌గా అటాక్ చేస్తారేమో..దళపతిని తక్కువ చేసి మాట్లాడుతారేమోనని మధన పడుతున్నారట. కేసీఆర్ మాత్రం ఎట్లైతే గట్లాయే..ఈ సారి మునుపటి లెక్క ఉండదు. దేనికైనా రెడీ..తగ్గేదేలే అంటున్నారట. అధికార పక్షం దాడిని గులాబీ బాస్ ఎలా ఎదుర్కోబోతున్నారు.? కేసీఆర్ దగ్గరున్న అసెంబ్లీ అస్త్రం ఏమిటి.?
అది బహిరంగ సభ అయినా..మీడియా సమావేశం అయినా..చిట్ చాట్ అయినా..సందర్భం ఏదైనా మాజీ సీఎం కేసీఆర్ పేరు ఎత్తకుండా సీఎం రేవంత్ రెడ్డి ఉండలేరు. పోనీ కేసీఆర్ పేరు తీసుకుని వదిలేస్తారా అంటే..ఎడాపెడా మాటలు తూటాలు పేలుస్తారు. బహిరంగ సభలు, మీడియా సమావేశాల్లో కేసీఆర్‌ను ఉద్దేశించి రేవంత్ మాట్లాడుతున్న మాటలకు ఇప్పటికే బీఆర్ఎస్ క్యాడర్, లీడర్లు, కేసీఆర్ అభిమానులు హర్ట్ అవుతున్నారట.
Also Read: Andhra Pradesh: ఆ జిల్లా విభజన.. ఆయనకు చెక్ పెట్టేందుకేనా?
అలాంటిది కేసీఆర్ అసెంబ్లీకి వస్తే..వివిధ అంశాలపై చర్చ సందర్భంగా కేసీఆర్‌పై నోరుజారకుండా ఉంటారా.? ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ నేతలను ఆందోళనకు గురిచేస్తున్న అంశమట. కేసీఆర్‌ను అవమానించేందుకే అసెంబ్లీకి రావాలని సవాల్ విసురుతున్నారని డౌట్ పడుతున్నారట బీఆర్ఎస్ లీడర్లు. బాస్ సభకు వెళ్తే మంచిదా.? లేకపోతే ప్రెస్‌మీట్లకే పరిమితమైతే బెటరా అనే డైలమాలో ఉన్నారట కారు పార్టీ ముఖ్యనేతలు.
శుక్రవారం నుంచి సభ కంటిన్యూగా జరగనుంది. 2వ తేదీ నుంచి జరిగే సమావేశాలకు గులాబీ బాస్ హాజరవుతారన్న టాక్ వినిపిస్తోంది. దీంతో ఈ సారి అసెంబ్లీ సెషన్ రసవత్తరంగా జరగనుందని పొలిటికల్ సర్కిల్స్‌లో చర్చ జరుగుతోంది. ప్రతిపక్ష నేత హోదాలో కేసీఆర్ సభకు వచ్చి చర్చల్లో పాల్గొంటారన్న ప్రచారం సామాన్య జనంలో క్యూరియాసిటీని పెంచుతోంది.
గులాబీ లీడర్ల ఆందోళన
అయితే కేసీఆర్ అసెంబ్లీకి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయోనన్నదానిపై గులాబీ లీడర్లు ఆందోళన చెందుతున్నారట. కేసీఆర్ గౌరవానికి సభలో భంగం వాటిల్లే ఛాన్స్ ఉందని గులాబీ పార్టీ ముఖ్యనేతలు ఆవేదన చెందుతున్నట్లు తెలంగాణ భవన్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కారు పార్టీ లీడర్ల ఆందోళనకు సీఎం రేవంత్ రెడ్డి మాట తీరే కారణమంటున్నారు.
కేసీఆర్ పేరు వింటేనే సీఎం రేవంత్ రెడ్డి ఒంటికాలిపై లేస్తున్నారు. కేసీఆర్ పేరును ప్రస్తావించి మరీ విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారు సీఎం. అంశం ఏదైనా కేసీఆర్ పేరును ప్రస్తావించి తీవ్రస్థాయిలో మండిపడుతూ వస్తున్నారు రేవంత్. అయితే సీఎం అడ్డూ అదుపు లేకుండా..కేసీఆర్‌ను విమర్శిస్తే ఆయన గౌరవానికి భంగం కలిగే అవకాశం ఉందని బీఆర్ఎస్ నేతలు కంగారు పడుతున్నారట.
రేవంత్‌కు కౌంటర్ ఇచ్చేందుకు మైక్ కట్ చేయకుండా కేసీఆర్‌కు మాట్లాడే అవకాశం ఇస్తారా లేరా అన్న డౌట్ కూడా వ్యక్తం చేస్తున్నారు గులాబీ పార్టీ నేతలు. కేసీఆర్‌ను అవమానించేందుకే అసెంబ్లీకి రావాలని పదే పదే సవాల్ విసురుతున్నారని, అందుకే బాస్ సభకు వెళ్తే బావుంటుందా..వెళ్లకపోవడమే మంచిదా అన్న ఊగిసలాటలో ఉన్నారట కారు పార్టీ లీడర్లు.
కేసీఆర్ హాజరుపై నో క్లారిటీ
అయితే కేసీఆర్ సభకు హాజరుపై పూర్తిస్థాయిలో క్లారిటీ లేదు. నందినగర్ నివాసం నుంచి సార్ ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు. దీంతో సభకు వస్తారా రారా అన్నది డౌటే. కానీ సభకు హాజరైతే మాత్రం ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవాలని డిసైడ్ అయ్యారట గులాబీ బాస్.
తనను అవమానించేలా మాట్లాడినా..అధికార పక్షం నేతలు నోరు జారినా..ఎక్కడా టెమ్ట్ కావొద్దని బీఆర్ఎస్ లీడర్లకు ఇండైరెక్ట్‌గా డైరెక్షన్స్ ఇచ్చారట. ఒకవేళ కాంగ్రెస్ నేతలు స్థాయి దిగజారి..తన పరువుకు నష్టం కలిగించేలా బిహేవ్ చేస్తే ఏం చేయాలో..తనకు తెలుసు అన్నట్లుగా నేతలతో చెప్పుకొచ్చారట కేసీఆర్.
సభకు రావాలంటూ సవాల్ విసిరి..వ్యక్తిగత విమర్శలు చేశారని ఎక్స్‌పోజ్ చేసి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేయాలనే వ్యూహం కూడా ఉందట. అందుకే ఈ సారి పరీక్ష మనకు కాదు..అధికార పక్షానికే అంటున్నారట గులాబీ బాస్. వాళ్ల ఓపిక..తీరిక..మనమ్ మాత్రం సబ్జెక్ట్ తోనే కొడుతాం..పాయింట్ టు పాయింట్ మాట్లాడుతాం..ఎవరేంటో ప్రజలే డిసైడ్ చేస్తారు..డోంట్ వర్రీ అంటూ లీడర్లకు దిశానిర్దేశం చేశారట కేసీఆర్. సార్ సభకు వెళ్తే చర్చలు..వాగ్వాదాలు ఎలా ఉంటాయో చూడాలి మరి.