Andhra Pradesh: ఆ జిల్లా విభజన.. ఆయనకు చెక్ పెట్టేందుకేనా?
పాత జిల్లాల్లో అన్నమయ్య జిల్లా పేరు ఉన్నప్పటికీ.. ఆ జిల్లా మ్యాపే మారిపోయింది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మారుస్తూ నిర్ణయం తీసుకోవడంతో.. రాయచోటి జిల్లా కేంద్రాన్ని కోల్పోయింది.
Peddireddy Ramachandra Reddy (Image Credit To Original Source)
- అన్నమయ్య జిల్లా విభజన వెనక వ్యూహం?
- ప్రజల డిమాండ్లు నెరవేరి.. టీడీపీ ప్లాన్ సక్సెస్?
- సీఎం చంద్రబాబు డెసిషన్‌తో పెద్దిరెడ్డికి చెక్?
Annamayya district: పాత జిల్లాల్లో ఒకటి తగ్గింది. కొత్తగా మూడు జిల్లాలు అయ్యాయి. ఒక జిల్లాలోని నియోజకవర్గాలను.. అటో దిక్కు.. ఇటో దిక్కు అన్నట్లుగా ప్రజల కోరిక మేరకు డివైడ్ చేసింది ఏపీ సర్కార్.
కానీ ఆ జిల్లా విషయంలో అనుకోకుండా డెసిషన్ తీసుకున్నారో..లేక పొలిటికల్ ప్లాన్ ఉందో కానీ..ఒక దెబ్బకు రెండు పిట్టలు అన్నట్లు అయిందన్న టాక్ వినిపిస్తోంది. ప్రజలు కోరుకున్నట్లు జిల్లా సర్దుబాటు చేయడంతో పాటు..తన చిరకాల ప్రత్యర్థికి కూడా సీఎం చంద్రబాబు చెక్ పెట్టారన్న చర్చ మొదలైంది. ఇంతకు ఎవరా నేత.? ఏ జిల్లా విభజన వెనక అంత పెద్ద కథ నడిచింది.?
సీఎం చంద్రబాబు ఏ నిర్ణయం తీసుకున్నా..అందులో ఏదో ఒక పొలిటికల్ కోణం ఉంటుంది. ఇది కామన్. చంద్రబాబు పనితీరు మీద అవగాహన వాళ్లు ఎవరైనా చెప్పే మాట ఇదే. ఇప్పుడు జిల్లా పునర్విభజన విషయంలో కూడా చంద్రబాబు వ్యూహాత్మక డెసిషన్ తీసుకున్నారన్న టాక్ వినిపిస్తోంది.
గత ప్రభుత్వం చేసిన తప్పులను సరిదిద్దడంతో పాటు..ప్రజలకు పాలనా సౌలభ్యం కోసం జిల్లాల పునర్విభజన చేశారు. అయితే పాత జిల్లాల్లో అన్నమయ్య జిల్లా పేరు ఉన్నప్పటికీ.. ఆ జిల్లా మ్యాపే మారిపోయింది. అన్నమయ్య జిల్లాల్లోని ఒక్కో నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాల్లో కలిపేసింది కూటమి సర్కార్.
Also Read: Video: నూతన సంవత్సరానికి ఘన స్వాగతం పలికిన న్యూజిలాండ్.. భారీ ఫైర్‌వర్క్స్
సాంకేతిక అంశాలు ఉంటాయని క్లారిటీ
అయితే ఒక్క రాయచోటి ప్రజల కోసమే జిల్లా చేయలేమని.. సాంకేతిక అంశాలు ఎన్నో ముడిపడి ఉంటాయని సీఎం చంద్రబాబు క్లారిటీ ఇచ్చారు. కానీ అన్నమయ్య జిల్లా విభజన వెనక పెద్ద స్కెచ్చే ఉందన్న టాక్ బయలుదేరింది. రాజకీయంగా రాజంపేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో బలంగా నాటుకుపోయిన పెద్దిరెడ్డి ఫ్యామిలీ ప్రభావాన్ని తగ్గించాలన్నదే చంద్రబాబు వ్యూహమంటూ చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే అన్నమయ్య జిల్లా విషయంలో అటు ప్రజల కోరిక నేరవేరుస్తూ..ఇటు తన పొలిటికల్ స్కెచ్ వర్కౌట్ అయ్యేలా బాబు డెసిషన్ తీసుకున్నారన్న ప్రచారం మొదలైంది. అటు స్వామికార్యం..ఇటు స్వకార్యం రెండూ నెరవేరినట్లు అయిందన్న టాక్ కూడా నడుస్తోంది.
వైసీపీ హయాంలో కుప్పంలో చంద్రబాబుకు గడ్డు పరిస్థితులను క్రియేట్ చేశారు. 2024లో అధికారంలో వచ్చాక చంద్రబాబు కూడా తిరిగి ఇచ్చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. కుంభకోణాల ఉచ్చులో ఇరుక్కుపోయిన పెద్దిరెడ్డి ఫ్యామిలీని..రాజకీయంగా కూడా దెబ్బతీసేలా పావులు కదుపుతున్నారని అంటున్నారు. పెద్దిరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరు జిల్లా పరిధి నుంచి అన్నమయ్య జిల్లా పరిధిలో మార్పించారు.
పెద్దిరెడ్డి ప్రభావాన్ని తగ్గించే ప్లాన్!
దీంతో రాజంపేట లోక్‌సభ నియోజకవర్గంలో పెద్దిరెడ్డి ప్రభావాన్ని తగ్గించే ప్లాన్ ఉందంటున్నారు. ఇక నకిలీ మద్యం కేసులో పెద్దిరెడ్డి సోదరుడు ద్వారకానాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న తంబళ్లపల్లె ఉండటం మరో అస్త్రం దొరికినట్లు అయిందంటున్నారు. అటు భూ కుంభకోణం, ఇటు లిక్కర్ స్కామ్ ఆరోపణల్లో చిక్కుకున్న పెద్దిరెడ్డి కుటుంబం..ఇటు రాజకీయంగా కూడా ఇబ్బందుల పాలయ్యే పరిస్థితిని క్రియేట్ చేస్తున్నారట.
ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధులున్న అన్నమయ్య జిల్లాను మూడు నియోజకవర్గాలకు పరిమితం చేశారు. ఆ మూడు నియోజకవర్గాల్లో రాజంపేటను వైఎస్సార్ కడప జిల్లా పరిధిలోకి తెచ్చారు.
కోడూరును తిరుపతి జిల్లాలో మెర్జ్ చేశారు. రాయచోటిని కొత్తగా ఏర్పడే మదనపల్లి జిల్లాలో కలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు మారుస్తూ నిర్ణయం తీసుకోవడంతో..రాయచోటి జిల్లా కేంద్రాన్ని కోల్పోయింది. ఇటు చిత్తూరు జిల్లాకు పుంగనూరు దూరం కావడంతో చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి ప్రభావం తగ్గుతుందనేది టీడీపీ అంచనా అంటున్నారు.
అన్నమయ్య జిల్లాకు చెందిన రాజంపేట లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని మూడు కీలక అసెంబ్లీ నియోజకవర్గాలు మూడు జిల్లాల పరిధుల్లోకి వెళ్లిపోయాయి. దీంతో ఆ మూడు సెగ్మెంట్లపై కూడా పెద్దిరెడ్డి ఫ్యామిలీ పట్టు కోల్పోవడం ఖాయమని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారట. ఇలా పెద్దిరెడ్డి కుటుంబం రాజకీయ ఆధిక్యతను దెబ్బతీసే స్కెచ్ వేశారన్న టాక్ వినిపిస్తోంది.
