Dammaiguda : తల్లిదండ్రులు జాగ్రత్త, చిన్నారులను టార్గెట్ చేస్తున్న దుండగులు

హైదరాబాద్‌ శివారులో ప్రజలను దొంగలు వణికిస్తుంటే... ఇప్పుడు మృగాళ్లు సైతం భయపెడుతున్నారు. ఇంటి దగ్గర ఉన్న చిన్నారులను టార్గెట్‌ చేస్తున్నారు దుండగులు. చాక్లెట్‌ ఆశజూపి, వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు.. బాలికల కిడ్నాప్‌కూ తెగబడుతున్నారు. మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడలో మరోసారి కిడ్నాప్‌ కలకలం చెలరేగింది.

Kidnapping

Dammaiguda Child Kidnap : హైదరాబాద్‌ శివారులో ప్రజలను దొంగలు వణికిస్తుంటే… ఇప్పుడు మృగాళ్లు సైతం భయపెడుతున్నారు. ఇంటి దగ్గర ఉన్న చిన్నారులను టార్గెట్‌ చేస్తున్నారు దుండగులు. చాక్లెట్‌ ఆశజూపి, వారిపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. అంతేకాదు.. బాలికల కిడ్నాప్‌కూ తెగబడుతున్నారు. మేడ్చల్‌ జిల్లా దమ్మాయిగూడలో మరోసారి కిడ్నాప్‌ కలకలం చెలరేగింది. దమ్మాయిగూడలో బాలికను కిడ్నాప్‌ చేసేందుకు దుండగుడు ప్రయత్నించాడు. బాలిక మాత్రం ఇంటికి పరుగెత్తుకుంటూ వెళ్లి చెప్పింది. దీంతో దుండగుడిని గుర్తించిన బాలిక తల్లి అతడిని నిలదీసింది.

Read More : Jakarta, Indonesia: : ఇండోనేషియాలో భూకంపం

వెంటనే ఆ ఆగంతకుడు అక్కడి నుంచి పరుగందుకున్నాడు. బాలిక తల్లి వెంబడించినా ఫలితం లేకుండా పోయింది. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. సరిగ్గా వారం రోజుల క్రితం ఇదే ప్రాంతంలో మూడేళ్ల చిన్నారిపై అత్యాచారం జరగడం అందర్నీ కలవరపెడుతోంది. గత శనివారం బాలికను కిడ్నాప్‌ చేశారు. ఆపై అత్యాచారం చేశారు. సోమవారం ఎవరికీ తెలియకుండా ఒక పార్క్‌లో పాపను వదిలివెళ్లారు. చిన్నారి పరిస్థితి మాత్రం సీరియస్‌గా ఉందని తెలుస్తోంది.
దమ్మాయిగూడ ప్రాంతంలో తరచూ ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటుండడంతో తల్లిదండ్రులు భయాందోనళలకు గురవుతున్నారు.

Read More : Guntur Jaswanth Reddy : వీరుడా వందనం, ముగిసిన వీర జవాన్ జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు

అంతకుముందు కూడా మరో ఇద్దరు చిన్నారులపై అత్యాచారం జరిగినట్టుగా స్థానికులు చెబుతున్నారు. ఇక్కడ కూలిపనులు చేసుకునే ప్రజలు ఎక్కువగా నివసిస్తుంటారు. చిన్నారులను ఇంటి దగ్గరే వదిలేసి వెళ్తుంటారు. ఇది కూడా నిందితులకు అవకాశంగా మారింది. పట్టపగలు ఎవరూ లేని సమయంలో బాలికల కిడ్నాప్‌లు జరుగుతున్నట్టు స్థానికులు చెబుతున్నారు. పోలీసులు ఎలాంటి నిఘా పెట్టకపోవడం కూడా నిందితులు తమకు అనువుగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చిన్నారులు వరుసగా కిడ్నాప్‌కు గురవ్వడం, అత్యాచారాలకు గురవుతుండడం స్థానికులను భయపెడుతోంది. పోలీసులు గస్తీ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.