Guntur Jaswanth Reddy : వీరుడా వందనం, ముగిసిన వీర జవాన్ జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు

జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన జవాను మరుప్రోలు జశ్వంత్‌రెడ్డి అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరుగుతున్నాయి. అంతకు ముందు జశ్వంత్‌రెడ్డి పార్ధివ దేహానికి హోంమంత్రి సుచరిత, పలువురు అధికారులు నివాళులు అర్పించారు. అంతకుముందు..మరుప్రోలు జశ్వంత్‌రెడ్డి అంతిమ యాత్ర ప్రారంభమైంది.

Guntur Jaswanth Reddy : వీరుడా వందనం, ముగిసిన వీర జవాన్ జశ్వంత్ రెడ్డి అంత్యక్రియలు

Guntur

Jaswanth Reddy Final Rites : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదుల కాల్పుల్లో మృతిచెందిన జవాను మరుప్రోలు జశ్వంత్‌రెడ్డి అంత్యక్రియలు సైనిక లాంఛనాలతో జరిగాయి. అమర్ రహే..జశ్వంత్ రెడ్డి, భారత్ మాతాకీ జై..అనే నినాదాలు మిన్నంటాయి. గుంటూరు జిల్లా బాపట్లకు చెందిన జశ్వంత్‌రెడ్డి పార్ధివ దేహానికి హోంమంత్రి సుచరిత, పలువురు అధికారులు నివాళులు అర్పించారు. అనంతరం సైనిక లాంఛనాలతో జశ్వంత్‌రెడ్డి పార్ధివ దేహాన్ని తరలించారు.  అంతిమయాత్రలో భారత జెండాలు చేతబూని ముందుకు కదిలారు.

Read More : Noise Pollution: నాయీస్ చేశారా.. లక్ష ఫైన్ కట్టాల్సిందే

బాపట్ల మండలం దరివాద కొత్తపాలెం గ్రామానికి చెందిన రైతు శ్రీనివాసరెడ్డి, వెంకటేశ్వరమ్మ దంపతుల పెద్ద కుమారుడు జశ్వంత్‌రెడ్డి. 2016లో మద్రాస్‌ రెజిమెంట్‌లో జవాన్‌గా చేరాడు. 2017లో జమ్మూకశ్మీర్‌కు వెళ్లాడు. అక్కడ విధులు నిర్వహిస్తూ గురువారం ఉగ్రవాదులు జరిపిన దాడిలో గాయపడి మృత్యువాత పడ్డాడు. ఒకటి రెండు నెలల్లో సెలవుల్లో ఇంటికి వస్తానని చెప్పాడని, ఆ సమయంలో జశ్వంత్‌కు పెళ్లి చేయాలని తల్లిదండ్రులు భావించారని బంధువులు తెలిపారు. ఇంతలోనే ఈ వార్త వినాల్సి వచ్చిందన్నారు.

Read More : Prashant Kishor: సీఎంతో ప్రశాంత్ కిషోర్ మూడు గంటల సమావేశం

జశ్వంత్‌రెడ్డి వీర మరణం వార్త తెలిసి విచారించానని.. ఆయన ఆత్మకు శాంతి కలగాలంటూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్వీట్‌ చేశారు. జశ్వంత్‌రెడ్డి వీరమరణం చెందటం పట్ల రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌, సీఎం వైఎస్‌ జగన్‌ విచారం వ్యక్తం చేశారు. ఉగ్ర పోరులో మాతృభూమి కోసం ప్రాణాలర్పించిన జశ్వంత్‌రెడ్డి చిరస్మరణీయుడని సీఎం అన్నారు. జశ్వంత్‌రెడ్డి కుటుంబానికి 50 లక్షల ఆర్థిక సాయాన్ని సీఎం ప్రకటించారు. దేశం కోసం ప్రాణాలర్పించిన జశ్వంత్‌రెడ్డికి వందనాలు అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ట్వీట్‌ చేశారు. 23 ఏళ్ల వయస్సులో జస్వంత్‌రెడ్డి ప్రాణ త్యాగాన్ని ఈ భూమి మరువదన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌… జశ్వంత్‌రెడ్డికి నివాళులర్పించారు.