కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అబద్ధాలు ప్రచారం.. బీఆర్ఎస్‌పై కోదండరెడ్డి ఫైర్
ప్రతిపక్షాలు ఎన్నికల కోసం రాజకీయాలు చేస్తున్నాయి. తప్పుడు చావు లెక్కలను సీఎస్ వద్దకు పంపారు. అందులో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారు కూడా వున్నారు.

kisan congress kodanda reddy: కరువు విషయంలో బీఆర్ఎస్, బీజేపీ బాధ్యతరాహితంగా మాట్లాడుతున్నాయని, రెండు పార్టీలు సింపతీ రాజకీయాలు చేస్తున్నాయని కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి విమర్శించారు. హైదరాబాద్ గాంధీ భవన్ లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొన్నటి వరకు అధికారంలో వున్న బీఆర్ఎస్.. ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు అని అబద్ధాలు చెప్తోందని ధ్వజమెత్తారు. కరువు అనేక రాష్ట్రాల్లో వుందని.. కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో వున్నప్పుడు కరువొచ్చినా దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కొన్నామని గుర్తు చేశారు.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా అట్లనే మాట్లాడుతున్నారు. కేంద్ర సర్కార్ డిజాస్టర్ మేనెజ్మెంట్ కింద కరువు ప్రాంతాలను ఆదుకోడానికి ముందుకురావాలి. గతంలో ఉమ్మడి ఏపీ, గుజరాత్ రాష్ట్రాలకు ఆనాడు కేంద్రంలో వున్న కాంగ్రెస్ సర్కార్ ఆదుకుంది. రాష్ట్రంలో నీటి మట్టం తగ్గిపోయింది, గ్రౌండ్ వాటర్ పడిపోయింది.. సాగుకు, తాగునీరు కరువైంది. పశుగ్రాసం కూడా కరువైంది. కూలీలకు ఉపాధి దొరకడం లేదు.. ఇవన్నీ దృష్టిలో కేంద్రం చొరవతీసుకోవాలి.
సీఎం రేవంత్ రివ్యూలు చేసి చర్యలు చేపడుతున్నారు. ప్రతిపక్షాలు ఎన్నికల కోసం రాజకీయాలు చేస్తున్నాయి. తప్పుడు చావు లెక్కలను సీఎస్ వద్దకు పంపారు. అందులో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారు కూడా వున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా 63 మంది చనిపోయారు. అందులో సగం మంది రైతులు సూసైడ్ చేసుకున్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో ప్రజలు ఇబ్బందులు పడ్డా కూడా బయటికి రాలేదని కోదండరెడ్డి అన్నారు.
Also Read: నా కూతురు కావ్య ఇక్కడే పుట్టింది.. మాపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు: కడియం శ్రీహరి