Kishan Reddy Deeksha : బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాత్రి నుంచి దీక్ష కొనసాగిస్తున్న కిషన్ రెడ్డి.. నేడు జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలకు పిలుపు
ఆయన రాత్రి నుంచి అక్కడే దీక్ష కొనసాగిస్తున్నారు. రాత్రంతా ఆయన దీక్ష కొనసాగింది. ఆఫీస్ లోనే ఆయన పార్టీ నేతలతో కలిసి దీక్షను కొనసాగిస్తున్నారు.

Kishan Reddy Deeksha
Kishan Reddy Deeksha – BJP Office : కేంద్రమంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో పార్టీ కార్యాలయంలో ఆయన దీక్షను కొనసాగిస్తున్నారు. ఇందిరాపార్క్ దగ్గర కిషన్ రెడ్డిని దీక్షను భగ్నం చేసిన పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కిషన్ రెడ్డిని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వదిలిపెట్టారు. కిషన్ రెడ్డి తమ పార్టీ కార్యాలయంలో దీక్షకు దిగారు.
ఆయన రాత్రి నుంచి అక్కడే దీక్ష కొనసాగిస్తున్నారు. రాత్రంతా ఆయన దీక్ష కొనసాగింది. ఆఫీస్ లోనే ఆయన పార్టీ నేతలతో కలిసి దీక్షను కొనసాగిస్తున్నారు. ఇవాళ ఉదయం 11 గంటలకు వరకు కిషన్ రెడ్డి దీక్ష కొనసాగిస్తారు. 9ఏళ్ల పాలనలో కేసీఆర్ సర్కార్ ఉద్యోగులను మోసం చేసిందంటూ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వద్ద కిషన్ రెడ్డి 24 గంటల ఉపవాస దీక్ష చేపట్టారు.
అయితే బుధవారం సాయంత్రం 6 గంటల వరకే దీక్షకు అనుమతి ఉందని వెంటనే దీక్ష శిబిరాన్ని ఖాళీ చేయాలని పోలీసులు కిషన్ రెడ్డికి సూచించారు. ఇవాళ ఉదయం 6 గంటల వరకు దీక్ష చేస్తానని పోలీసులకు తెలిపారు. దీంతో రాత్రి 8 గంటల సమయంలో పోలీసులు ఆయన దీక్షను భగ్నం చేశారు.ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది.
కేంద్రమంత్రి హోంమంత్రి అమిత్ షా ఫోన్ లో పరామర్శించారు. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటాన్ని కొనసాగించాలని సూచించారు. పోరాటానికి కేంద్ర పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. కిషన్ రెడ్డిని నిరాహరదీక్షను పోలీసులు భగ్నం చేయడం పట్ల పార్టీ ఎంపీ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతియుతంగా దీక్ష చేస్తుంటే భగ్నం చేస్తారా అని ప్రశ్నించారు.
Kishan Reddy : తెలంగాణలో జమిలి ఎన్నికలపై కిషన్ రెడ్డి హాట్ కామెంట్స్
సీఎం కేసీఆర్ నిరుద్యోగులకు చేసిన మోసాలాను దీక్ష ద్వారా ఎండగడుతుంటే ప్రభుత్వం తట్టుకోలేకపోతుందన్నారు. రజాకార్ల పాలనకు చరమ గీతం పాడే సమయంలో వచ్చిందన్నారు. ప్రభుత్వ తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు జిల్లా, మండల కేంద్రాల్లో నిరసనలకు పిలుపునిచ్చారు.