Kodandaram: ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్.. గవర్నర్ ఆమోదం

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదించారు.

Kodandaram: ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్.. గవర్నర్ ఆమోదం

KodandaRam

Updated On : January 25, 2024 / 4:42 PM IST

తెలంగాణలో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియమితులయ్యారు. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాలను గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆమోదించారు.

వారిద్దరిని గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించడంతో తమిళిసై ఈ నిర్ణయం తీసుకునున్నారు. నిన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి రాజ్‌భవన్‌కు వెళ్లి ఎమ్మెల్సీల అంశంపై చర్చించారు.

కాగా, టీజేఎస్ పార్టీ అధినేత కోదండరాం 2018 తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన విషయం తెలిసిందే. 2023 ఎన్నికల్లో పోటీ చేయకుండా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించారు.

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషనర్ ఛైర్మన్‌గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి నియామకాన్ని కూడా గవర్నర్ తమిళిసై ఇవాళ ఆమోదించిన విషయం తెలిసిందే.

మంత్రివర్గంలోకి కోదండరాం?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఇటీవల ఢిల్లీ వెళ్లి ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, నామినేటెడ్ పోస్టుల భర్తీపై చర్చించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కోదండరాం బేషరతుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చి ఆ పార్టీ విజయానికి కృషి చేశారు. ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంతో మంత్రివర్గంలోకి తీసుకోబోతున్నారన్న ప్రచారం జరుగతోంది. త్వరలోనే మంత్రివర్గ విస్తరణకు అవకాశం ఉంది. మరో ఆరుగురిని కేబినెట్ లో తీసుకునే అవకాశం ఉంది.

Sajjala Ramakrishna Reddy: వైఎస్ షర్మిలపై సజ్జల ఆసక్తికర కామెంట్స్