Komatireddy Venkat Reddy: అందుకే తెలంగాణ తల్లి నూతన విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నాం: అసెంబ్లీలో కోమటిరెడ్డి
తెలంగాణ తల్లి అంటే చాకలి ఐలమ్మ లాగో, మన పల్లెటూరి తల్లిలాగో ఉంటుందని భావిస్తే.. ఇదేంటి ఇలా ఉందని గతంలో అనిపించిందని అన్నారు.

Komatireddy Venkat Reddy
చరిత్రలో ఈ రోజు నిలిచిపోయే రోజని తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఇవాళ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. మన ఆస్థిత్వానికి ప్రతికలైన వ్యవసాయం చేసుకునే తల్లిని తెలంగాణ తల్లి రూపంలో గౌరవించుకునే సందర్భం గొప్పదన్నారు.
తనకు తెలంగాణ అంటే ఎక్కడలేని అభిమానమని, అందుకే 11 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశానని కోమటిరెడ్డి తెలిపారు. 3 సంవత్సరాలు మంత్రి పదవిని అనుభవించే అవకాశం ఉన్న రాజీనామా చేసిన తర్వాత మళ్లీ అటు వైపు చూడలేదని చెప్పారు. మిలియన్ మార్చ్ లో రబ్బర్ బుల్లెట్స్ తగిలినా వెనక్కి తగ్గలేదని తెలిపారు.
తెలంగాణ తల్లి అంటే చాకలి ఐలమ్మ లాగో, మన పల్లెటూరి తల్లిలాగో ఉంటుందని భావిస్తే.. ఇదేంటి ఇలా ఉందని గతంలో అనిపించిందని అన్నారు. మన పోరాటాలు, ఉద్యమాలు, శ్రమజీవులకు ప్రతీకలైన వ్యవసాయం చేసుకునే మన తల్లిలాగ ఉండాలని ఇవాళ కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం నూతన తెలంగాణ తల్లిని ఆవిష్కరించిందని తెలిపారు.
తెలంగాణ అంటే ఆత్మగౌరవం, స్వేచ్ఛ, చైతన్యం.. కానీ, గత పదేండ్లలో జరిగిన సంఘటనలు మనకు మాయని మచ్చల్లా వెంటాడుతున్నయని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు. అందుకే, ఇప్పుడు తెలంగాణ అస్థిత్వాన్ని సరైన స్థానంలో నిలబెట్టాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. ఈ క్రమంలోనే మన అస్థిత్వానికి ప్రతీకలు, నిజాయితీకి నిలువుటద్దాలు, కష్టానికి ప్రతిరూపాలైన వ్యవసాయం చేసుకునే స్త్రీమూర్తిని.. పోలిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించామన్నారు.
చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి విజయసాయి రెడ్డిది కాదు: మండిపడ్డ హోం మంత్రి అనిత