Case filed on former minister ktr in hanamkonda
KTR: రుణమాఫీ వచ్చినోళ్లు మాత్రమే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయాలని తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. మోసపోయిన వారు అందరూ బీఆర్ఎస్‌కు ఓటు వేయాలని చెప్పారు. నల్గొండ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశం జరిగింది. ఇందులో కేటీఆర్ మాట్లాడారు.
కేసీఆర్ పొలంబాట వీడియోలను చూస్తే ఎంతగా ఆదరణ ఉందో అర్థమవుతుందని, నల్గొండ జిల్లాలో ఎలా ఓడిపోయామో తెలియడం లేదని చెప్పారు. పదేళ్ల నిజం ముందు 100 రోజుల అసత్యాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. కరెంటు, నీళ్లు ఇవ్వకపోయినప్పటికీ, పంటలు ఎండిపోతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకే ప్రజలు ఓటు వేస్తే ఆ నేతలు ఐదేళ్లు తప్పించుకు తిరుగుతారని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్‌తో డేంజర్ లేదని, ఏక్‌నాథ్ షిండే లాంటి వారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారని కేటీఆర్ తెలిపారు. సీఎం పదవి ఇస్తే బీజేపీలోకి వస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి చెప్పారని అన్నారు. ఈ ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరతారని చెప్పారు.
Also Read: అసలు ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది ఎవరు? ఈసీ పునఃసమీక్ష చేయాలి: బొత్స