అసలు ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది ఎవరు? ఈసీ పునఃసమీక్ష చేయాలి: బొత్స

వారికి పెన్షన్లు ఇవ్వనివ్వకుండా చంద్రబాబు, నిమ్మగడ్డ రమేశ్ అడ్డుకున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు.

అసలు ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేసింది ఎవరు? ఈసీ పునఃసమీక్ష చేయాలి: బొత్స

Minister Botsa Satyanarayana

ఎన్నికల వేళ వాలంటీర్లపై విధించిన ఆంక్షలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇవాళ విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదు చేసింది ఎవరని ప్రశ్నించారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరుతో కొందరు కావాలనే ఫిర్యాదు చేసినట్లు చెప్పారు.

దీనికి నిమ్మగడ్డ రమేశ్ అధ్యక్షుడిగా ఉన్నారని బొత్స సత్యనారాయణ తెలిపారు. ఇప్పటివరకు వాలంటీర్లే పెన్షన్ ఇచ్చారని, అప్పుడు రాని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వస్తుందని ప్రశ్నించారు. పేద ప్రజలపై కొందరు కక్ష పెంచుకున్నారని చెప్పారు. మూడు నెలల పాటు పెన్షన్ లబ్ధిదారులకు ఇబ్బందులు తప్పవని తెలిపారు. 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నారని చెప్పారు.

వారికి పెన్షన్లు ఇవ్వనివ్వకుండా చంద్రబాబు, నిమ్మగడ్డ రమేశ్ అడ్డుకున్నారని బొత్స సత్యనారాయణ అన్నారు. ఇటువంటి చర్యలు సరికాదని చెప్పారు. దీనిపై ఎన్నికల కమిషన్ పునఃసమీక్ష చేయాలని అన్నారు. పేదలకు పెన్షన్లు రాకుండా చేస్తున్న వారిని భగవంతుడు క్షమించడని తెలిపారు.

కాగా, ఏపీలో వాలంటీర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. సంక్షేమ పథకాల అమలుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని, వాలంటీర్లకు ఇచ్చిన మొబైల్ ఫోన్లు సహా ఇతర పరికరాలు స్వాధీనం చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల కోడ్ ఉన్నంతవరకు ఈ ఆదేశాలు వర్తిస్తాయని పేర్కొంది.

Also Read: వాళ్లకు భయం పట్టుకుంది.. ఫోన్ ట్యాపింగ్ విషయంపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఉత్తమ్