వాళ్లకు భయం పట్టుకుంది.. ఫోన్ ట్యాపింగ్ విషయంపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఉత్తమ్

పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ మిగలదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.

వాళ్లకు భయం పట్టుకుంది.. ఫోన్ ట్యాపింగ్ విషయంపై కీలక వ్యాఖ్యలు చేసిన మంత్రి ఉత్తమ్

Minister Uttam Kumar Reddy

Uttam Kumar Reddy : తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వంద శాతం నా ఫోన్ కూడా ట్యాప్ చేశారని అన్నారు. ట్యాపింగ్ చేసిన వాళ్లను వదిలేదే లేదని, ట్యాపింగ్ వెనుక ఎంత పెద్ద నాయకులు ఉన్నా శిక్ష పడుతుందని ఉత్తమ్ హెచ్చరించారు. కూతురు ఒక కేసులో ఇరుక్కుపోయింది. గొర్రెల స్కాంలో కొందరు ఇరుక్కుపోయారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎవరెవరు ఇరుకుతారో అని బీఆర్ఎస్ వాళ్లకు భయం పట్టుకుందని ఉత్తమ అన్నారు.

Also Read : ఏపీ కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా రేపు విడుదల.. షర్మిల ఎక్కడ నుంచి పోటీచేస్తారంటే?

వాళ్లకు డిపాజిట్లు కూడారావు..
బీఆర్ఎస్ నేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని, కేసీఆర్ కుటుంబం తప్ప మిగతా అందరూ కాంగ్రెస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నారని మంత్రి ఉత్తమ కుమార్ రెడ్డి అన్నారు. పేద, మధ్య తరగతి వర్గాల ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా సాగుతున్న కాంగ్రెస్ పాలనను చూసి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వస్తున్నారని తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీలకు డిపాజిట్లు కూడా రావని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 సీట్లు తప్పకుండా గెలుస్తామని ఉత్తమ్ జోస్యం చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ పార్టీ మిగలదని మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు.

Also Read : తీహార్ జైల్లో సౌకర్యాల లేమిపై కవిత అసంతృప్తి

మేము అలాంటి వాళ్లం కాదు..
తెలంగాణలో తాగునీరు సమస్య, కరెంట్ సమస్య లేదని ఉత్తమ్ అన్నారు. కేసీఆర్ లాగా మాకు ఫామ్ హౌజ్ లో పడుకునే అలవాటు లేదని, ప్రతీరోజూ సచివాలయానికి వస్తున్నామని చెప్పారు. ప్రతి సమస్యపై వారంపదిరోజులకు ఒకసారి రివ్యూ చేస్తున్నామని ఉత్తమ్ పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో 40వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టారని విమర్శించారు. కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు దబాయింపు చేశారని, మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి రావటం జరగదని అన్నారు.