ఏపీ కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా రేపు విడుదల.. షర్మిల ఎక్కడ నుంచి పోటీచేస్తారంటే?

ఏపీలో 114 అసెంబ్లీ, ఐదు ఎంపీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయిందని, అభ్యర్థుల జాబితాను రేపు విడుదల చేస్తామని వైఎస్ షర్మిల అన్నారు.

ఏపీ కాంగ్రెస్ అభ్యర్ధుల జాబితా రేపు విడుదల.. షర్మిల ఎక్కడ నుంచి పోటీచేస్తారంటే?

YS Sharmila

YS Sharmila : ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ (సీఈసీ) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీలో అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి వచ్చింది. ఈ విషయంపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మాట్లాడారు. ఏపీలో 114 అసెంబ్లీ, ఐదు ఎంపీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక పూర్తయినట్లు తెలిపారు. అభ్యర్థుల జాబితా రేపు విడుదల చేస్తామని, పెండింగ్ నియోజకవర్గాల్లో అభ్యర్థులను వారంరోజుల్లో ఖరారయ్యే అవకాశం ఉందని అన్నారు. ఇదిలాఉంటే.. షర్మిల ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే చర్చ ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. షర్మిల కడప నుంచి పోటీ చేస్తారనే వార్తలు వస్తున్న నేపథ్యంలో సీఈసీ సమావేశంలోనూ ఈ అంశంపై చర్చ జరిగినట్లు సమాచారం. అయితే, షర్మిల ఏ నియోజకవర్గంలో నుంచి పోటీ చేస్తారు? అనే విషయంపై రేపు క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

Also Read : YS Sharmila : ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పోటీ చేేసే స్థానాలపై షర్మిల కీలక ప్రకటన

ఏపీలో వాలంటీర్ల ద్వారా పెన్షన్లు పంపిణీ విషయంలో ఈసీ నిర్ణయంపై ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెన్షన్లు అందించాలని ఈసీ ఆదేశించిందని, ప్రభుత్వ యంత్రాగం ఆలస్యంచేస్తే ప్రతిపక్షాలపై నింద మోపాలని వైసీపీ చూస్తుందని షర్మిల విమర్శించారు. పెన్షన్ల పంపిణీపై నేను స్వయంగా సీఎస్ తో మాట్లాడానని అన్నారు. ఒకరోజులో చేసే పనికి 10రోజులు సమయం పడుతోంది. డీబీటీ ద్వారా పంపిణీ చేయకుండా నేరుగా ఇస్తామంటున్నారని షర్మిల అన్నారు. పెన్షన్ల పంపిణీ విషయంలో సీఎస్ చొరవ తీసుకోవాలని, వెంటనే డీబీటీ ద్వారా పెన్షన్లను పంపిణీ చేయాలని వైఎస్ షర్మిల కోరారు.