KTR
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. లండన్‌లో రేవంత్ చేసిన కామెంట్స్ సీఎం హోదాకు తగ్గట్టు లేవని చెప్పారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మాట్లాడుతూ… జనవరి నెల విద్యుత్ బిల్లులను ప్రజలు ఎవరూ కట్టొద్దని చెప్పారు. బిల్లులను కాంగ్రెస్ నాయకురాలు సోనియా గాంధీ ఇంటికి పంపాలని అన్నారు.
తెలంగాణలోని ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఇస్తానని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఆ హామీని వెంటనే నెరవేర్చాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను వంద మీటర్ల లోతులో బొంద పెడతానని రేవంత్ రెడ్డి అంటున్నారని తెలిపారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలు వంద రోజుల్లో అమలు చేయకపోతే ఆ పార్టీనే ప్రజలు బొంద పెడతారని అన్నారు.
కాంగ్రెస్ ఇచ్చిన హమీలు అమలు చేయడం అసాధ్యమని చెప్పారు. బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ కాదని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని చెప్పారు. ఢిల్లీలో ఉండే మోదీది, ఉంటే తెలంగాణలో చోటా మోదీ.. రేవంత్ రెడ్డిది ఒకే వ్యవహార శైలి అని విమర్శించారు. రేవంత్ రెడ్డి మరో ఏక్‌నాథ్ షిండే అవతారం ఎత్తుతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ఎక్కువ రోజులు ఉండబోరని చెప్పారు.
కాగా, హైదరాబాద్, సికింద్రాబాద్ ఎంపీ స్థానాలపై బీఆర్ఎస్ సన్నాహక సమావేశం నిర్వహించింది. రెండు నియోజక వర్గాల పరిధి నేతలకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు దిశానిర్దేశం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో ఈ సమావేశం జరిగింది.
చంద్రబాబుతో వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయలు భేటీ.. టీడీపీ నాయకుల్లో టెన్షన్