Kukatpally Sahasra Case: సహస్రని హత్య చేసిన తర్వాత బాలుడు ఏం చేశాడంటే.. పాయింట్ టు పాయింట్ చెప్పిన పోలీసులు

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసు (Kukatpally Sahasra Case) మిస్టరీ వీడింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు వివరాలు ..

Kukatpally Sahasra Case: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కూకట్‌పల్లి బాలిక సహస్ర హత్య కేసు (Kukatpally Sahasra Case) మిస్టరీ వీడింది. ఈ కేసుకు సంబంధించి సీపీ అవినాష్ మహంతి వివరాలను వెల్లడించారు. క్రికెట్ బ్యాట్ కోసమే ఇదంతా జరిగినట్టు తేలిందని అన్నారు. బ్యాట్ దొంగతనం కోసం నెల రోజుల ముందే బాలుడు ప్లాన్ చేసినట్లు, బాలిక హత్యకు వాడిన కత్తిని కూడా స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. అయితే, సహస్ర హత్య తరువాత దొరక్కుండా ఉండేందుకు బాలుడు అనేక ప్రయత్నాలు చేశాడని పోలీసులు చెప్పారు.

ఇంట్లో ఎవరూ లేరని భావించిన బాలుడు.. సహస్ర ఇంట్లోకి దొంగతనానికి వెళ్లాడు. నెల రోజుల నుంచి ఇందుకోసం ప్లాన్ సిద్ధం చేసుకున్నాడు. ఎలా వెళ్లాలి.. ఎవరి కంట కనపడకుండా ఎలా బయటకు రావాలి అనే విషయాలను పేపర్ పై రాసుకొని.. ఆ ప్రకారం దొంగతనం పూర్తి చేయాలని బాలుడు భావించాడు. క్రికెట్ బ్యాట్ దొంగిలించేందుకే సహస్ర ఇంటికి బాలుడు వెళ్లాడు. కిచెన్ లో ఉన్న బ్యాట్ తీసుకుని వెళ్తుంటే సహస్ర చూసింది. వెంటనే దొంగ దొంగ అని అరిచింది. దీంతో సహస్రను బెడ్ రూంలోకి తోసి ఆమెపై కత్తితో దాడి చేశాడు. బాలికను తోసేసి కళ్లు మూసుకొని కత్తితో పొడిచాడు. ఇంట్లో ఎవరూ లేని భావించి బాలుడు సహస్ర ఇంట్లోకి దొంగతనానికి వెళ్లాడు.. కానీ సహస్ర ఉండే సరికి ఆమెపై దాడి చేసి హత్య చేశాడని పోలీసులు తెలిపారు.

సహస్ర హత్య తరువాత గోడ దూకి బాలుడు తన ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లో రక్తపు మరకలు కనిపించకుండా జాగ్రత్త పడ్డాడు. హత్య తరువాత ఆధారాలు మాయం చేసే ప్రయత్నం చేశాడు. ఇంటి ముందున్న సీసీ కెమెరాల్లో బాలుడు వచ్చిన ఆధారాలు లేవు. ఈనెల 18న బాలిక హత్య జరిగింది. మూడు రోజుల వరకు సరైన క్లూ దొరకలేదు. నిందితుడు పోలీసులను తప్పుదారి పట్టించాడు. సోషల్ మీడియాలో క్రైం కంటెంట్ వీడియోలు, సినిమాలు చూసి దొంతనం కోసం పక్కాగా ప్లాన్ చేసుకున్నాడని పోలీసులు చెప్పారు. దొంగతనం సమయంలో ఒకవేళ ఎవరైనా చూస్తే వాళ్లను బెదిరించి రావడం, దాడి చేయడం కోసం
కత్తి తీసుకెళ్లాడానికి పోలీసులు చెప్పారు.

హత్య తరువాత అక్కడే కత్తి కడిగేశాడు. ఆ తర్వాత గోడదూకి వాళ్ల ఇంట్లోకి వెళ్లాడు. ఇంట్లో వాళ్ల నాన్న, సిస్టర్స్ ఉన్నారు. వారికి రక్తం మరక కనిపించకుండా ఉండేందుకు.. బయట ఆరేసిన షర్ట్ తీసుకుని రక్తం మరకకు అడ్డుగా పెట్టుకొని ఇంట్లోకి వెళ్లాడు. స్నానం చేసి రక్తం మరకలు ఉన్న చొక్కా కడిగి, ప్యాంట్, చొక్కా వాషింగ్ మెషిన్‌లో వేశాడు. సహస్ర హత్య తరువాత.. బాలుడు తల్లికి అనుమానం వచ్చింది. బాలుడి వద్దకు వెళ్లి నువ్వు హత్య చేశావా..? అని ప్రశ్నించింది. బాలుడు లేదు అని చెప్పాడు. ఇదే సమయంలో నువ్వే నన్నుపట్టించేలా ఉన్నావ్ అంటూ తల్లిపై గట్టిగా అరిచాడు. ఈ కేసు విచారణ ప్రారంభించిన కొద్ది గంటలకే బాలుడిపై అనుమానం వచ్చింది. అయితే, ఆర్డర్ ప్రకారం విచారిస్తూ వచ్చే సరికి ఆలస్యమైందని పోలీసులు తెలిపారు.

రెండు నెలల క్రితం బాలుడికి ఫోన్ వచ్చింది. దీంతో ఫోన్ నీకు ఎలా వచ్చిందని వాళ్ళ అమ్మ ప్రశ్నించింది. వాస్తవానికి అబ్బాయి కుటుంబం ఆర్థిక పరిస్థితి బాగా లేదు. వాళ్ల అమ్మ కూడా ఫోన్ కోసం డబ్బులు ఇవ్వలేదు. దాన్ని బట్టి ఇతర క్రైమ్ లు ఏమైనా చేశాడా అనే విషయంపై విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు. బాలుడికి ఒక కుందేలు ఉండేది. ఆ కుందేలుని తీసుకుని డాక్టర్ దగ్గరికి వెళితే అది కూడా చనిపోయింది. అయితే, అమ్మనాన్నల పరిస్థితి బాగోలేదు.. అందుకే బ్యాట్ కొనమని వాళ్లను అడగలేదని బాలుడు చెప్పినట్లు పోలీసులు తెలిపారు.

Also Read: Sahasra Case : సహస్ర హత్యకి మొదట అడుగు పడింది ఆ రోజే.. బయటపెట్టిన పోలీసులు