Kumari Aunty help for flood victims
కుమారీ ఆంటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. హైదరాబాద్‌లో రోడ్ సైడ్ ఫుడ్ స్టాల్ పెట్టుకుని బిజినెస్ చేసుకుంటూ సోషల్ మీడియా పుణ్యమా అని ఫేమస్ అయిపోయింది. తాజాగా ఆమె తన మంచి మనసును చాటుకుంది. ఇటీవల తెలంగాణ రాష్ట్రంలో కురిసిన వర్షాలు, వరదాల వల్ల ఎంతో నష్టం జరిగింది. ఈ క్రమంలో వరద బాధితులను ఆదుకునేందుకు సామాన్యులతో పాటు సినీ, రాజకీయ ప్రముఖలు తమ వంతు సాయాన్ని అందిస్తున్నారు.
ఈ క్రమంలో కుమారి ఆంటీ కూడా తన వంతు సాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.50 వేలను విరాళంగా అందించింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆమెను అభినందించారు.
హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు.. “జానీ మాస్టర్”ది లవ్ జిహాద్ కేసు: బీజేపీ
హైదరాబాద్ కేబుల్ బ్రిడ్జి వద్ద స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేస్తూ జీవనం సాగిస్తుంది కుమారీ ఆంటీ. సోషల్ మీడియా పుణ్యమా అంటూ ఫేమస్ అయ్యింది. దీంతో ఆమె ఫుడ్ స్టాల్ వద్ద రద్దీ పెరిగింది. యూట్యూబ్ వీడియోస్‌తో కస్టమర్స్ కూడా పెరిగారు. ఆమె మాట్లాడిన రెండు లివర్లు వెయ్యి రూపాయిలు అనే డైలాగ్ నెట్టింట వైరల్ అయింది.
కుమారీ ఆంటీ వద్ద భోజనానికి కస్టమర్లు పోటీ పడడంతో రద్దీ పెరగడంతో ఆ మార్గంలో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి, కుమారీ ఆంటీపై కేసు నమోదు చేశారు. రోడ్లపై భోజనం అమ్మడానికి వీల్లేదని షాపును మూసివేశారు. ఈ విషయం వైరల్ కావడంతో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఆమెకు అండగా నిలిచారు. అక్కడే వ్యాపారం చేసుకోవచ్చునని తెలిపారు. కేసును కూడా విత్ డ్రా చేసుకోవాలని పోలీసులకు సూచించిన సంగతి తెలిసిందే.