హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నారు.. “జానీ మాస్టర్”ది లవ్ జిహాద్ కేసు: బీజేపీ
హిందూ అమ్మాయిలను ముస్లిం అబ్బాయిలు ట్రాప్ చేసి లవ్ చేస్తున్నారని చెప్పారు.

BJP Mahila Morcha TG President Dr Shilpa Reddy
కొరియోగ్రాఫర్ షేక్ జానీ బాషా కేసును లవ్ జిహాద్ కేసుగా అభివర్ణిస్తోంది తెలంగాణ బీజేపీ. బీజేపీ మహిళా మోర్చా తెలంగాణ అధ్యక్షురాలు డా.శిల్పారెడ్డి ఇవాళ మీడియాతో మాట్లాడుతూ.. మైనర్‌గా ఉన్నప్పటి నుంచే జానీ బాషా లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని యువతి చెబుతోందని అన్నారు.
మతం మారాలంటూ ఒత్తిళ్లకు గురిచేయడాన్ని బీజేపీ తీవ్రంగా ఖండిస్తోందని, ఇది లవ్ జిహాద్ కేసని హిందూ అమ్మాయిని ట్రాప్ చేసినట్లు స్పష్టం అవుతుందని తెలిపారు. నిందితుడు జానీ మాస్టర్ నెల్లూరులో ఉన్నాడని తెలిసినా పోలీసులు ఎందుకు అరెస్ట్ చేయడం లేదని నిలదీశారు. దీనిపైన ఇప్పటివరకు తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు స్పందించకపోవడం దురదృష్టకరమని అన్నారు.
ఇది స్పష్టంగా లవ్ జిహాద్ కేస్ అని, హిందూ అమ్మాయిలను ముస్లిం అబ్బాయిలు ట్రాప్ చేసి లవ్ చేస్తున్నారని చెప్పారు. తెలంగాణలో రోజురోజుకు అత్యాచారాలు మహిళల మీద వేధింపులు పెరుగుతున్నాయని, హోం మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి స్పందించడం లేదని అన్నారు. జానీ మాస్టర్ చేతిలో మోసపోయిన బాధితురాలికి న్యాయం జరిగేంత వరకు ఆమె పక్షాన తాము పోరాడతామని తెలిపారు.
ట్రాఫిక్ జంక్షన్లు క్లియర్ అయ్యాయి.. హైదరాబాద్‌లో నిమజ్జనంపై పూర్తి వివరాలు తెలిపిన సీపీ సీవీ ఆనంద్