Rowdy Gang : కరీంనగర్ లో ల్యాండ్ సెటిల్ మెంట్స్ గ్యాంగ్ దౌర్జన్యం..మంత్రి మనుషులమంటూ పేదల ఇళ్లు కూల్చివేత
కష్టపడి ఇళ్లు నిర్మించుకున్నామని చెప్పినా వినిపించుకోకుండా కబ్జా గ్యాగ్ ఇళ్ల నిర్మాణాలను కూల్చివేశారు. మాకే ఎదురు చెప్తారా? అంటూ పేదలకు బెదిరింపులకు పాల్పడ్డారు.

Roudy Gang
Land Settlements Gang : కరీంనగర్ లో ల్యాండ్ సెటిల్ మెంట్స్ గ్యాంగ్ రచ్చ రచ్చ చేశారు. మంత్రి మనుషులమంటూ పేదలపై దౌర్జన్యానికి దిగారు. రేకుర్తి శివారులో సర్వే నెం.117లో సాదాబైనామాతో పేదలు భూమి కొన్నారు. గ్రామ పంచాయతీ అనుమతులతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు.
అయితే ఇదే సర్వే నెంబర్ లో తమ భూమి ఉందంటూ ఓ వర్గం రంగంలోకి దిగింది. ల్యాండ్ ఖాళీ చేయించేందుకు రౌడీ గ్యాంగ్ రంగంలోకి దిగింది. సెటిల్ మెంట్ గ్యాంగ్ గడ్డపారలతో ఇంటి నిర్మాణాలను కూల్చివేశారు.
Gang Attack : హోటల్‌పై రౌడీల దాడి-దౌర్జన్యంగా నగదు ఎత్తుకెళ్లిన గ్యాంగ్
కష్టపడి ఇళ్లు నిర్మించుకున్నామని చెప్పినా వినిపించుకోకుండా కబ్జా గ్యాగ్ ఇళ్ల నిర్మాణాలను కూల్చివేశారు. మాకే ఎదురు చెప్తారా? అంటూ పేదలకు బెదిరింపులకు పాల్పడ్డారు. కాగా, తమకేమీ తెలియదన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్నారు.