×
Ad

Medaram Jatara: మేడారం జాతరలో భక్తులకు తప్పిన పెను ప్రమాదం.. ఒక్కసారిగా కూలిన

ఇలాంటి ప్రమాదాలు పునరావృతమైతే పరిస్థితి ఊహించలేము అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు.

  • కుప్పకూలిన లైటింగ్ నేమ్ బోర్డ్
  • ఒక భక్తుడికి గాయాలు, ఆసుపత్రికి తరలింపు
  • ఇలాంటి ప్రమాదాలు జరక్కుండా చూడాలని అధికారులకు విజ్ఞప్తి

 

Medaram Jatara: మేడారం జాతరలో భక్తులకు పెద్ద ప్రమాదం తప్పింది. హరిత వై జంక్షన్ దగ్గర ఒక్కసారిగా లైటింగ్ నేమ్ బోర్డ్ కింద పడిపోయింది. ఈ ఘటనలో ఒక భక్తుడికి గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటన సమయంలో అక్కడ భక్తులు ఎక్కువగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. జంపన్న వాగు నుంచి గద్దెలకు వెళ్లే రోడ్డు మార్గంలో ఈ ప్రమాదం జరిగింది. మేడారం జాతరకు భక్తులు లక్షలాదిగా తరలి వస్తున్నారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతమైతే పరిస్థితి ఊహించలేము అని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇప్పటికైనా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. మరోవైపు పోలీసులు రంగంలోకి దిగారు. లైటింగ్ బోర్డు కింద పడటానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

మేడారం లోపల అధికారుల నిర్లక్ష్యం, సమన్వయ లోపం బయటపడింది. హరిత వై జంక్షన్ సమీపంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో భక్తులు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. మేడారం జాతరకు లక్షల మంది భక్తులు తరలివస్తారు. జనం ఎక్కువగా వచ్చే ఇటు వంటి ప్రాంతంలో అధికారులు చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే, ఈ ఘటనలో అధికారుల నిండు నిర్లక్ష్యం కనిపిస్తుంది. జాతరకు ఘన స్వాగతం అంటూ భారీ హోర్డింగ్స్ అయితే ఏర్పాటు చేశారు కానీ.. భక్తుల సేఫ్టీ గురించి మాత్రం మరిచిపోయారు.

సైన్ బోర్డ్ ను జాగ్రత్తగా నిలిపారా లేదా అన్నది పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. భారీ హోర్డింగ్ కుప్పకూలిన ఘటనలో మరిపెడకు చెందిన ఓ భక్తుడు హోర్డింగ్ లోపల చిక్కుకుపోయాడు. ఆర్తనాదాలు పెట్టాడు. అక్కడ భారీ హోర్డింగ్ ఎవరు ఏర్పాటు చేశారు? ప్రభుత్వమా, ప్రైవేట్ వ్యక్తులా? అంత పెద్ద హోర్డింగ్ ఏర్పాటు చేసినప్పుడు కనీస రక్షణ చర్యలు తీసుకోవాలి కదా అని భక్తులు నిలదీస్తున్నారు. అధికారుల వైఖరిపై తీవ్రంగా మండిపడుతున్నారు.

Also Read: మంత్రులకు మున్సిపోల్స్ టెన్షన్..! వారిని వెంటాడుతున్న కొత్త భయం ఏంటి?