కరోనా పీడ విరగడవుతుందా ? : తెలంగాణలో Lockdown ఎత్తివేయాలా ? వద్దా ?

  • Published By: Mahesh ,Published On : April 27, 2020 / 08:31 AM IST
కరోనా పీడ విరగడవుతుందా ? : తెలంగాణలో Lockdown ఎత్తివేయాలా ? వద్దా ?

Updated On : April 27, 2020 / 8:31 AM IST

కరోనా పీడ ఎప్పుడు విరగడవుతుంది ? ఈ లాక్ డౌన్ ఎత్తివేస్తారా ? లేదా ? ఎత్తివేస్తే ఎప్పుడు తీసేస్తారు ? రోడ్లపై ముందటి రోజుల్లగా తిరగుతామా ? ఇలాంటి ఎన్నో ప్రశ్నలకు సమాధానం కొద్ది రోజుల్లో సమాధానం రానుంది. ప్రస్తుతం భారతదేశంలో లాక్ డౌన్ మే 03 వరకు కొనసాగనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కొన్నింటికి నిబంధనలను సడలించింది కేంద్రం. మరోవైపు రోజురోజుకు మాత్రం కేసులు పెరుగుతూనే ఉన్నాయి.

ఈ నేపథ్యంలో లాక్ డౌన్ సడలింపులు, ఎత్తివేయాడాలు వద్దనే సూచనలు చేస్తున్నారు. లాక్ డౌన్ ముగిశాక కూడా మళ్లీ పొడిగించాలా ? వద్దా ? అనే దానిపై కేంద్రం తర్జనభర్జనలు పడుతోంది. మే 03 లాక్ డౌన్ ముగియనుండగా..తెలంగాణలో రాష్ట్రంలో మే 07వ తేదీతో ముగియనుంది. లాక్ డౌన్ పై బిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లాక్ డౌన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాప్తిని అడ్డుకోలేమని అంటున్నారు. ప్రస్తుతం దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుంటుపడిన సందర్భంలో…20 నుంచి 45 ఏళ్లలోపు ఉన్న యువకులను (ఎలాంటి అనారోగ్య సమస్యలు) లేని వారిని పనుల్లోక పంపించాలని పలువురు సూచిస్తున్నారు. ఆఫీసులు, ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగాలకు యువకులను వెళ్లనివ్వాలి.

ప్రధానంగా జనసమ్మర్థం ఎక్కువగా ఉండే..(థియేటర్స్, మాల్స్, క్రీడలు, ఇతరత్రా) వాటిని తెరవకూడదని, అవసరమైతే శని, ఆదివారాల్లో పూర్తిగా లాక్ డౌన్ విధించాలంటున్నారు. దశల వారీగా లాక్ డౌన్ ఎత్తివేయాలని కొంతమంది వైద్య నిపుణులు సూచిస్తున్నారని సమాచారం. వ్యక్తుల మధ్య కనీస సోషల్ డిస్టెన్స్ పాటించాలని సూచిస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.