Malla Reddy: మైనంపల్లి పార్టీని వీడారు.. ఆయన గురించి..: మంత్రి మల్లారెడ్డి

తమ పార్టీ ఎమ్మెల్సీ కవితకు ఎలాంటి సమస్య లేదని మల్లారెడ్డి చెప్పారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని...

Malla Reddy: మైనంపల్లి పార్టీని వీడారు.. ఆయన గురించి..: మంత్రి మల్లారెడ్డి

Malla Reddy

Updated On : September 23, 2023 / 4:46 PM IST

Malla Reddy-Mynampally: మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు బీఆర్ఎస్‌ను వీడారని, ఆయన గురించి ఆలోచించడం ఇక అనవసరమని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అన్నారు. తిరుపతి జిల్లా (Tirupati district) శ్రీకాళహస్తి (Srikalahasti ) ముక్కంటి సన్నిధిలో ఇవాళ స్వామివారిని దర్శించుకున్నాక మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి, ముఖ్యమంత్రి కేసీఆర్ హ్యాట్రిక్ విజయం సాధించాలని స్వామివారిని వేడుకున్నానని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. కేసీఆర్ తెలంగాణలో ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి, దేశంలో నెంబర్ వన్ సీఎంగా కొనసాగుతున్నారని చెప్పారు. దేశ రాజకీయాల్లోనూ కేసీఆర్ చక్రం తిప్పుతారని అన్నారు.

తమ పార్టీ ఎమ్మెల్సీ కవితకు ఎలాంటి సమస్య లేదని మల్లారెడ్డి చెప్పారు. త్వరలోనే అన్నీ సర్దుకుంటాయని తెలిపారు. కాగా, బీఆర్ఎస్ కు మైనంపల్లి హనుమంతరావు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన కుమారుడికి బీఆర్ఎస్‌లో టికెట్ కేటాయించలేదని ఆయన ఆ పార్టీని వీడారు. ఇక, కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో విచారణ ఎదుర్కొంటున్నారు. వీటిపైనే మల్లారెడ్డి మాట్లాడారు.

KA Paul: నేను గతంలోనే చెప్పాను.. ఇప్పుడు మోదీ, షా ఒక్క ఫోన్ చేస్తే ఆయన బయటకు రారా?: కేఏ పాల్