Mahabubnagar : మటన్ ముక్క గొంతులో పడి ఊపిరాడక వ్యక్తి మృతి..
మటన్, ఫిష్ లాంటి మాంసాహారం తింటున్నప్పుడు జాగ్రత్తలు పాటించాలి. ఏ మాత్రం ఏమరుపాటుగా తిన్నా వాటిలో ముల్లు, బోన్స్ గొంతులో ఇరుక్కునే ప్రమాదం ఉంది.

Mahabubnagar
Mahabubnagar : ఎప్పుడే తినే మాంసాహారమే.. పాపం అతని పాలిట మృత్యుదేవత అయ్యింది. మటన్ ముక్క గొంతులో ఇరుక్కుని ఓ వ్యక్తి చనిపోయిన సంఘటన మహబూబ్‌నగర్ జిల్లాలో జరిగింది.
ప్రొటీన్ల కోసం చికెన్, మటన్ లు తింటున్నారా! తక్కువ ఖర్చుతో ఈ ఆహారాలు తీసుకుంటే సరిపోతుంది
మాంసాహారం తినేటపుడు కొంచెం జాగ్రత్తలు పాటించాలి. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నామాంసం ముక్కలు గొంతులో అడ్డం పడే ప్రమాదం ఉంది. మహబూబ్‌నగర్ జిల్లా కోనాపురానికి చెందిన ముత్తయ్య విషయంలో అదే జరిగింది. ఎంతో సంతోషంగా కొడుకుతో కలిసి భోజనం చేస్తున్నాడు. అంతలో మటన్ ముక్క గొంతులో ఇరుక్కుపోయింది. ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి అయ్యాడు. వెంటనే ఆసుపత్రికి తరలించినా ఊపిరాడక ముత్తయ్య చనిపోయాడు.
Mutton : మటన్ తినటం ఆరోగ్యానికి మంచిదేనా?
ముత్తయ్య మరణంతో కుటుంబం విషాదంతో మునిగిపోయింది. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.