Medico Preethi Case : డాక్టర్ ప్రీతి కేసులో కీలక పరిణామం, అతడికి బెయిల్ మంజూరు

Medico Preethi Case: 16 వారాల పాటు ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం కోర్టులో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ ఉన్న నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడ్డా, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినా.. బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించారు న్యాయమూర్తి.

Medico Preethi Case (Photo : Google)

Medico Preethi Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన వరంగల్ ఎంజీఎం డాక్టర్ ప్రీతి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ సైఫ్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. 10 వేల రూపాయలు ఇద్దరి పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది.

16 వారాల పాటు ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం కోర్టులో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ ఉన్న నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడ్డా, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినా.. బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించారు న్యాయమూర్తి. డాక్టర్ సైఫ్ గురువారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

Also Read..Medico Student Preeti : సైఫ్ వేధింపులపై ఫోన్ లో తల్లితో చెప్పి బాధపడిన ప్రీతి

కాకతీయ మెడికల్ కాలేజీకి చెందిన డాక్టర్ ప్రీతి మృతి కేసులో రెండు కీలక పరిణామాలు ఇవాళ చోటు చేసుకున్నాయి. ప్రధాన నిందితుడు డాక్టర్ సైఫ్ కు షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.

జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి కాకతీయ మెడికల్ కాలేజీ (కేఎంసీ)లో పీజీ (అనస్థీషియా) ఫస్టియర్ చదువుతోంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రీతి మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్య చేసుకుందని కుటుంబసభ్యులు ఆరోపించారు.

Also Read..Medico Preeti Case : వరంగల్ మెడికో ప్రీతి కేసులో నిందితుడు అరెస్టు.. ర్యాగింగ్ తోపాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

ఆత్మహత్యాయత్నానికి ముందు సైఫ్ వేధింపులపై ఫోన్ లో తన తల్లితో చెప్పి ప్రీతి బాధపడింది. డాక్టర్ సైఫ్ తనతోపాటు జూనియర్స్ ను వేధిస్తున్నాడని ప్రీతి తన తల్లికి చెప్పి ఆవేదన వ్యక్తం చేసింది. సైఫ్ వేధింపులు రోజు రోజుకూ ఎక్కువై పోతున్నాయంది. అయితే, భయపడొద్దు అంటూ తల్లి శారద ప్రీతికి చెప్పింది. ధైర్యంగా ఉండాలని పదే పదే చెప్పింది. కానీ, ప్రయోజనం లేకుండా పోయింది. ప్రీతి సూసైడ్ చేసుకుంది.