Medico Preeti Case : వరంగల్ మెడికో ప్రీతి కేసులో నిందితుడు అరెస్టు.. ర్యాగింగ్ తోపాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో కేఎంసీ విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం సంచలనం రేపుతోంది. కేఎంసీ పీజీ విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీస్ శాఖ ప్రీతి కేసును వేగవంతం చేసింది.

Medico Preeti Case : వరంగల్ మెడికో ప్రీతి కేసులో నిందితుడు అరెస్టు.. ర్యాగింగ్ తోపాటు ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు

police arrested sife

Medico Preeti Case : వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో కేఎంసీ విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం సంచలనం రేపుతోంది. కేఎంసీ పీజీ విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. పోలీస్ శాఖ ప్రీతి కేసును వేగవంతం చేసింది. ఆరోపణలను ఎదుర్కొంటున్న డా.సైఫ్ ను వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. ర్యాగింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

డా.సైఫ్ పై మట్టెవాడ పోలీస్ స్టేషన్ లో ర్యాగింగ్, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు అయింది. ప్రాథమిక విచారణలో సైంటిఫిక్ ఆధారాలను పోలీసులు సేకరించారు. ప్రీతి రూమ్ లో అనస్తీషియా శాంపిల్స్ అభ్యమయ్యాయి. మరోవైపు మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వైద్యులు, కేఎంసీ అధికారులు ర్యాగింగ్ జరగలేదంటున్నారు. కాగా, ప్రీతి ఆత్మహత్యకు యత్నించిన ఆధారాలు లేవని తోటి మెడికోలు అంటున్నారు. పోలీసులు మాత్రం ర్యాగింగ్ కేసు నమోదు చేశారు.

PG Medical Student: విషమంగానే పీజీ వైద్య విద్యార్థిని పరిస్థితి.. ఆత్మహత్యాయత్నం ఘటనపై అధికారుల నివేదిక

వరంగల్ ఎంజీఎంకి పోలీస్ కమిషనర్ చేరుకున్నారు. పోలీస్ కమిషనర్ ఎంజీఎం చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఆధారాలు లేని ఆరోపణలు చేయొద్దని వైద్య విద్యార్థులు అంటున్నారు. ఒకే కోణంలో కేసులు విచారణ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారు ఇరువురికి న్యాయం చేయాలని కోరారు. సైఫ్ తప్పు చేశాడని మీడియా కథనాలు ఇవ్వడాన్ని వైద్య విద్యార్థులు తప్పు పట్టారు.

నిన్నటితో పోల్చితే ప్రీతి ఆరోగ్యంలో కదలిక వచ్చినట్లుగా తెలుస్తుందని ప్రీతి తండ్రి నరేందర్ తెలిపారు. డాక్టర్స్ గట్టిగా తట్టి లేపితే కళ్ళు తెరిచిందని.. కళ్ళు బ్లింక్ అవుతున్నాయని చెప్పారు. ఈరోజు శుక్రవారం ఊపిరి తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్ ఎంత ఖర్చైనా మంచి వైద్యం చేయిస్తామని తెలిపారని చెప్పారు. అయితే ఆరోపణలు ఎదురుకుంటున్న సైఫ్ నీ అరెస్ట్ చేసినట్టుగా వార్తలు మాత్రమే విన్నామని… అతన్ని మీడియా ముందుకు ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నిస్తున్నామని అన్నారు. తమకి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు.

Medical Student Preethi : నిందితులను వదలం- ప్రీతి ఘటనపై మంత్రి హరీశ్ రావు

ప్రీతి ఆరోగ్యం కొంత మెరుగుపడుతోందని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. డాక్టర్ల బృందంతో కలిసి ప్రీతిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు తట్టి లేపితే ఒక్కసారి కనురెప్పలు కదిలించిందని చెప్పారు. ప్రీతికి మెరుగైన వైద్యం అందించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిమ్స్ ఆసుపత్రి డైరెక్టర్ కి ఆదేశాలు ఇచ్చారని గుర్తు చేశారు. ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరించి నాణ్యమైన వైద్యాన్ని అందిస్తామన్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై ఇప్పటికి కేసు ఫైల్ అయింది కాబట్టి వరంగల్ సీపీ ఈ పరిస్థితికి కారణమైన వాళ్లపై చర్యలు తప్పనిసరిగా తీసుకుంటారని స్పష్టం చేశారు. ఎటువంటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. స్త్రీలకు హాస్టల్లో రక్షణ ఉందని, ఎంతటి వారైనా శిక్షించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు.

జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో పీజీ (అనస్థీషియా) ఫస్టియర్ చదువుతున్నారు. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రీతి బుధవారం ఉదయం మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కుటుంబసభ్యులు పేర్కొన్నారు. ఎమర్జెన్సీ ఆపరేషన్‌ థియేటర్‌ లో విధులు నిర్వహిస్తుండగా ప్రీతి ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.  స్పృహ లేని స్థితిలో ఉన్న ఆమెను వెంటనే అక్కడి నుంచి ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు.

PG Medico Health Update: కాస్త మెరుగుపడ్డ ప్రీతి ఆరోగ్యం.. నాణ్యమైన వైద్యం అందిస్తామన్న మంత్రి సత్యవతి రాథోడ్

పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఆమెను ఏఆర్‌సీయూ (ARCU)లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రీతి తీసుకున్న ఇంజెక్షన్లు ఆమె శరీరంలో ఉన్న అవయవాలపై తీవ్ర ప్రభావం చూపించాయని, వెంటిలేటర్‌పై వైద్యచికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న ప్రీతి అక్కడే అనస్థీషియా ఇంజెక్షన్లు తీసుకున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది.

పీజీ విద్యార్థి ప్రీతి ఆత్మహత్యాయత్నం కేసులో విచారణ వేగవంతమైంది.  ఇప్పటికే ఈ ఘటనపై ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ ప్రాథమిక విచారణ నివేదికను ప్రభుత్వానికి అందించారు. విచారణ కోసం ముగ్గురు సీనియర్ ప్రొఫెసర్లతో కమిటీని నియమించారు. ప్రీతికి ఐదుగురు డాక్టర్ల బృందం అందించిన వైద్యం పై నివేదిక సమర్పించారు. ప్రీతికి అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు చికిత్స అందిస్తున్న సమయంలో గుర్తించామన్నారు. త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్టునే ప్రామాణికంగా తీసుకుంటామని డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు.