Medical Student Preethi : నిందితులను వదలం- ప్రీతి ఘటనపై మంత్రి హరీశ్ రావు

మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్తాయిలో విచారణ చేపడుతోందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. అందుకు కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి తేల్చి చెప్పారు. నిమ్స్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు మంత్రి హరీశ్ రావు. ప్రీతి తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడిన మంత్రి హరీష్ రావు.. అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు.

Medical Student Preethi : నిందితులను వదలం- ప్రీతి ఘటనపై మంత్రి హరీశ్ రావు

Medical Student Preethi : రాష్ట్రంలో సంచలనం రేపిన మెడికో ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్తాయిలో విచారణ చేపడుతోందని మంత్రి హరీశ్ రావు తెలిపారు. అందుకు కారణమైన వారిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని మంత్రి తేల్చి చెప్పారు. నిమ్స్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు మంత్రి హరీశ్ రావు. ప్రీతి తల్లిదండ్రులతో ఫోన్ లో మాట్లాడిన మంత్రి హరీష్ రావు.. అండగా ఉంటామని వారికి ధైర్యం చెప్పారు.

వరంగల్ వైద్య విద్యార్థిని ప్రీతి ఘటనపై తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పందించారు. నిమ్స్ ఆసుపత్రికి వెళ్లిన గవర్నర్.. ప్రీతి కుటుంబసభ్యులను పరామర్శించారు. ఒక డాక్టర్ గా ప్రీతి కండీషన్ ను అర్థం చేసుకోగలను అని అన్నారు. ఆమె ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందని తెలిపారు. ప్రీతికి అవసరమైన వైద్య సదుపాయాన్ని నిమ్స్ డాక్టర్లు అందిస్తున్నారని, ఆమె ఆరోగ్యంగా బయటకు రావాలని కోరుకుందాం అని గవర్నర్ తమిళిసై ఆకాంక్షించారు.

Also Read..PG Medical Student: విషమంగానే పీజీ వైద్య విద్యార్థిని పరిస్థితి.. ఆత్మహత్యాయత్నం ఘటనపై అధికారుల నివేదిక

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో అనస్థీషియా పీజీ ఫస్టియర్ విద్యార్థిని ప్రీతి ఆత్మహత్యాయత్నం సంచలనం రేపింది. ఈ కేసులో విచారణ వేగవంతమైంది. ఈ ఘటనపై ప్రాథమిక విచారణ నివేదికను ప్రభుత్వానికి అందించారు ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్. విచారణ కోసం ముగ్గురు సీనియర్ ప్రొఫెసర్లతో కమిటీని నియమించారు. ప్రీతికి ఐదుగురు డాక్టర్ల బృందం అందించిన వైద్యం పై నివేదిక సమర్పించారు డాక్టర్ చంద్రశేఖర్. ప్రీతికి అనేక రకాల ఆరోగ్య సమస్యలు ఉన్నట్లు చికిత్స అందిస్తున్న సమయంలో గుర్తించామన్నారు. త్రిసభ్య కమిటీ ఇచ్చిన రిపోర్టునే ప్రామాణికంగా తీసుకుంటామన్నారు డాక్టర్ చంద్రశేఖర్.

అసలేం జరిగింది?
జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామానికి చెందిన ప్రీతి కాకతీయ మెడికల్ కాలేజీ(కేఎంసీ)లో పీజీ (అనస్థీషియా) ఫస్టియర్ చదువుతోంది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో శిక్షణలో ఉన్న ప్రీతిని సీనియర్ విద్యార్థి సైఫ్ వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు ఉన్నాయి. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రీతి బుధవారం ఉదయం మత్తు ఇంజెక్షన్ తీసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని కుటుంబసభ్యులు తెలిపారు.

ఎమర్జెన్సీ ఆపరేషన్‌ థియేటర్‌ లో విధులు నిర్వహిస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. స్పృహ లేని స్థితిలో ఉన్న ఆమెను వెంటనే అక్కడి నుంచి ఎమర్జెన్సీ వార్డులోకి తరలించి, అత్యవసర వైద్యం అందించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నిమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. ఆమెను ఏఆర్‌సీయూ (ARCU)లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ప్రీతి తీసుకున్న ఇంజెక్షన్లు ఆమె శరీరంలో ఉన్న అవయవాలపై తీవ్ర ప్రభావం చూపించాయని, వెంటిలేటర్‌పై వైద్యచికిత్స అందిస్తున్నామని, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. అనస్థీషియా విభాగంలో పనిచేస్తున్న ప్రీతి అక్కడే అనస్థీషియా ఇంజెక్షన్లు తీసుకున్నట్టు ప్రాథమికంగా తెలుస్తోంది.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.

మరోవైపు ప్రీతి ర్యాగింగ్ కేసు విచారణను పోలీసులు ముమ్మరం చేశారు. ప్రీతిని వేధించిన సైఫ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. సైఫ్‌ను పోలీసులు విచారించనున్నారు. సైఫ్ స్వస్థలం హనుమకొండ జిల్లా కాజీపేట. కాగా సైఫ్‌కు జూనియర్ డాక్టర్లు మద్దతుగా నిలిచారు. ర్యాగింగ్ తప్పుడు ప్రచారం అని వారంటున్నారు.