PG Medical Student: విషమంగానే పీజీ వైద్య విద్యార్థిని పరిస్థితి.. ఆత్మహత్యాయత్నం ఘటనపై అధికారుల నివేదిక

ప్రీతి అవయవాలు దెబ్బతినడంతోపాటు బ్రెయిన్ డ్యామేజ్ అయిందని, దీంతో ఆమె కోమాలో ఉందని వైద్యులు తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తోందన్నారు. వరంగల్ నుంచి ప్రీతిని హైదరాబాద్ తీసుకొచ్చే సమయంలోనే ఆమెకు గుండె ఆగిపోతే, సీపీఆర్ చేసి తిరిగి గుండె కొట్టుకునేలా చేసినట్లు వైద్యులు తెలిపారు.

PG Medical Student: విషమంగానే పీజీ వైద్య విద్యార్థిని పరిస్థితి.. ఆత్మహత్యాయత్నం ఘటనపై అధికారుల నివేదిక

PG Medical Student: వరంగల్, కేఎంసీ పీజీ వైద్య విద్యార్థిని ప్రీతి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు హైదరాబాద్ నిమ్స్ వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆమెకు అత్యవసర చికిత్స కొనసాగుతోంది. ప్రీతి ఎజెక్షన్ ఫ్రాక్షన్ ఓఫ్ హార్ట్, గ్లోబల్ హిపోకైనేషియా, పాంక్రియాటైటిస్, అసైటీస్, ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నట్లు వైద్య బృందం గుర్తించింది.

Gurugram: కోవిడ్ భయంతో మూడేళ్లుగా ఇంటి నుంచి బయటకు రాని తల్లీకొడుకు.. మూడేళ్లుగా ఎలా ఉన్నారంటే

ప్రీతి అవయవాలు దెబ్బతినడంతోపాటు బ్రెయిన్ డ్యామేజ్ అయిందని, దీంతో ఆమె కోమాలో ఉందని వైద్యులు తెలిపారు. ప్రత్యేక వైద్యుల బృందం ఆమెకు చికిత్స అందిస్తోందన్నారు. వరంగల్ నుంచి ప్రీతిని హైదరాబాద్ తీసుకొచ్చే సమయంలోనే ఆమెకు గుండె ఆగిపోతే, సీపీఆర్ చేసి తిరిగి గుండె కొట్టుకునేలా చేసినట్లు వైద్యులు తెలిపారు. మరోవైపు ప్రీతి ఆత్మహత్యాయత్నం ఘటనపై ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ తీవ్రంగా స్పందించింది. దీనిపై విచారణకు ముగ్గురు సీనియర్ ప్రొఫెసర్‌లతో త్రిసభ్య కమిటీని నియమించింది.

Karnataka: ఫ్యాక్టరీల్లో రాత్రిపూట మహిళలకు పని.. వారానికి నాలుగు రోజులే డ్యూటీ.. కొత్త చట్టం తెచ్చిన కర్ణాటక

ఈ విచారణ కమిటీలో గైనకాలజీ హెచ్ఓడీ, జనరల్ హెచ్ఓడీ, సర్జరీ హెచ్ఓడీలకు చోటు కల్పించింది. 24 గంటల్లోగా ఈ ఘటనపై కమిటీ నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేయాల్సి ఉంది. విచారణ కోసం త్రిసభ్య కమిటీ గురువారం ఎంజీఎంలో ప్రత్యేకంగా సమావేశమవుతుంది. సంఘటన జరిగిన ప్రాంతంతోపాటు ప్రీతి డ్యూటీలో ఉన్న వివిధ విభాగాల్లోనూ ఈ కమిటీ విచారణ చేపడుతుంది. ప్రీతి ఆత్మహత్యాయత్నం తర్వాత ఐదుగురు డాక్టర్ల బృందం అక్కడ ప్రీతికి అందించిన వైద్యంపై నివేదికను ఎంజీఎం సూపరిండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ రూపొందించారు.

Meta Layoffs: మళ్లీ ఉద్యోగాల కోతకు రెడీ అవుతున్న మెటా.. వేల మంది ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధం

ఇప్పటికే ఈ నివేదికను డీఈఎం సహా వరంగల్ కలెక్టర్, పోలీస్ కమిషనర్‌కు అందజేశారు. ఈ ఘటనపై ప్రీతి తండ్రి చేసిన ఆరోపణలపైగానీ, లేదా పీజీ విద్యార్థుల సంఘం చేసిన డిమాండ్లను గానీ అంగీకరించబోమని డాక్టర్ చంద్రశేఖర్ ప్రకటించారు. నిజానిజాలు తేల్చేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ రిపోర్టునే ప్రామాణికంగా తీసుకుంటామని ఆయన చెప్పారు. ఫోన్ల ద్వారా వేధింపులు జరిగాయా.. లేదా.. ఏయే కోణాల్లో వేధింపులు జరిగాయి అనేది నివేదిక ద్వారానే తేలుస్తామని డాక్టర్ చంద్రశేఖర్ అన్నారు.