Karnataka: ఫ్యాక్టరీల్లో రాత్రిపూట మహిళలకు పని.. వారానికి నాలుగు రోజులే డ్యూటీ.. కొత్త చట్టం తెచ్చిన కర్ణాటక

దీని ప్రకారం ఇకపై మహిళలు కూడా రాత్రిపూట ఫ్యాక్టరీల్లో పని చేయొచ్చు. ఈ బిల్లులో అనేక కొత్త నిబంధనల్ని ప్రభుత్వం రూపొందించింది. మహిళల పని విషయంలో అనేక పరిమితులు ఉన్నాయని, దీంతో సాఫ్ట్‌వేర్ రంగంతోపాటు అనేక పరిశ్రామిక రంగాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది.

Karnataka: ఫ్యాక్టరీల్లో రాత్రిపూట మహిళలకు పని.. వారానికి నాలుగు రోజులే డ్యూటీ.. కొత్త చట్టం తెచ్చిన కర్ణాటక

Karnataka: కర్ణాటక రాష్ట్రం అరుదైన చట్టం చేసింది. ఫ్యాక్టరీల్లో రాత్రి పూట మహిళలు పని చేసేందుకు అనుమతిస్తూ రూపొందించిన బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ మేరకు బుధవారం నిర్వహించిన సమావేశంలో ఫ్యాక్టరీ యాక్ట్‌కు మార్పులు చేసింది.

Gurugram: కోవిడ్ భయంతో మూడేళ్లుగా ఇంటి నుంచి బయటకు రాని తల్లీకొడుకు.. మూడేళ్లుగా ఎలా ఉన్నారంటే

దీని ప్రకారం ఇకపై మహిళలు కూడా రాత్రిపూట ఫ్యాక్టరీల్లో పని చేయొచ్చు. ఈ బిల్లులో అనేక కొత్త నిబంధనల్ని ప్రభుత్వం రూపొందించింది. మహిళల పని విషయంలో అనేక పరిమితులు ఉన్నాయని, దీంతో సాఫ్ట్‌వేర్ రంగంతోపాటు అనేక పరిశ్రామిక రంగాల నుంచి వచ్చిన ఒత్తిళ్ల మేరకు ఈ మార్పులు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. తాజా బిల్లు ప్రకారం.. ఇకపై మహిళలు రాత్రి పూట కూడా ప్యాక్టరీల్లో పని చేయొచ్చు. సాయంత్రం ఏడు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు కూడా పని చేయొచ్చు. అయితే, మహిళలు పని చేసేందుకు తగిన వాతావరణం కల్పించాలి.

Delhi New Mayor: ఢిల్లీ మేయర్‌పై దాడికి బీజేపీ యత్నం.. మున్సిపాలిటీ సమావేశం రసాభాస.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఆప్, బీజేపీ

అవసరమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి. నిబంధనలకు అనుగుణమైన రక్షణ ఏర్పాట్లు ఉన్న చోట మాత్రమే మహిళలు పని చేయొచ్చు. ఇందుకు యాజమాన్యం పూర్తి బాధ్యత వహించాలి. పని చేసే చోట ఎలాంటి లైంగిక వేధింపులకు అవకాశం లేకుండా చూడాలి. రాత్రి పూట పని చేసే వారి కోసం రవాణా ఏర్పాట్లు చేయాలి. వాహనాల్లో సీసీ కెమెరాలుండాలి. వాహనాలు జీపీఎస్‌తో అనుసంధానమై ఉండాలి. కనీసం పది మంది మహిళలు ఉంటేనే రాత్రిపూట వారిని పని చేయించాలి. అలాగే మంచి లైటింగ్‌తో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలి.

వాటి ద్వారా కనీసం 45 రోజుల వీడియో ఫుటేజ్ స్టోర్ చేయగలగాలి. అలాగే ఇతర ఉద్యోగులు ఎవరైనా రోజూ గరిష్టంగా 12 గంటల వరకు పని చేయొచ్చు. గతంలో ఈ నిబంధన 9 గంటల వరకే ఉండేది. అంటే కంపెనీలు ఉద్యోగులతో వరుసగా 12 గంటలు పని చేయించుకోవచ్చు. అయితే, వారానికి మొత్తం 48 పని గంటలు మించకూడదు. రోజూ 12 గంటలు పని చేసే వాళ్లు నాలుగు రోజులే పని చేసి, మూడు రోజులు విశ్రాంతి తీసుకోవచ్చు.