Delhi New Mayor: ఢిల్లీ మేయర్‌పై దాడికి బీజేపీ యత్నం.. మున్సిపాలిటీ సమావేశం రసాభాస.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఆప్, బీజేపీ

అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకున్న తర్వాత షెల్లీ ఒబెరాయ్ ఆధ్వర్యంలో తిరిగి సమావేశం జరిగింది. స్టాండింగ్ కమిటీ ఎన్నిక నిర్వహించేందుకు ఒబెరాయ్ ప్రయత్నించారు. అయితే, స్టాండింగ్ కమిటీ ఎన్నిక రసాభాసగా మారింది. బీజేపీ, ఆప్ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు

Delhi New Mayor: ఢిల్లీ మేయర్‌పై దాడికి బీజేపీ యత్నం.. మున్సిపాలిటీ సమావేశం రసాభాస.. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న ఆప్, బీజేపీ

Updated On : February 23, 2023 / 9:05 AM IST

Delhi New Mayor: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో బీజేపీ నేతలు తనపై దాడికి యత్నించినట్లు కొత్తగా ఎన్నికైన మేయర్‌ షెల్లీ ఒబెరాయ్ ఆరోపించారు. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం బుధవారం జరిగిన సంగతి తెలిసిందే. ముందుగా నిర్వహించిన ఓటింగ్‌లో షెల్లీ ఒబెరాయ్ మేయర్‌గా ఎన్నికయ్యారు.

IND vs AUS Womens Semifinal: టీ20 ప్రపంచ కప్‌లో కీలక మ్యాచ్.. సెమీస్‌లో ఆసీస్‌తో తలపడనున్న భారత్

అధ్యక్ష పీఠాన్ని సొంతం చేసుకున్న తర్వాత షెల్లీ ఒబెరాయ్ ఆధ్వర్యంలో తిరిగి సమావేశం జరిగింది. స్టాండింగ్ కమిటీ ఎన్నిక నిర్వహించేందుకు ఒబెరాయ్ ప్రయత్నించారు. అయితే, స్టాండింగ్ కమిటీ ఎన్నిక రసాభాసగా మారింది. బీజేపీ, ఆప్ నేతలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. సభ్యులు వాటర్ బాటిళ్లు, పేపర్ బాల్స్ విసిరిసేుకున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు తనపై దాడికి యత్నించారని కొత్తగా ఎన్నికైన షెల్లీ ఒబెరాయ్ ఆరోపించారు. బీజేపీ కార్పొరేటర్ శిఖా రాయ్ తన మైక్రోఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించిందని షెల్లీ ఆరోపించింది.

Arkansas Plane Crashes: యూఎస్‌లో కూలిన ట్విన్ ఇంజిన్ విమానం.. ఐదుగురు దుర్మరణం

‘‘బీజేపీకి చెందిన గూండాలు మేయర్‌తోపాటు, ఆమ్ ఆద్మీకి చెందిన మహిళా సభ్యులపై వాటర్ బాటిళ్లతో దాడి చేశారు. బీజేపీ గూండాలు, దౌర్జన్యాన్ని దేశమంతా చూసింది’’ అంటూ ఆమ్ ఆద్మీ ట్వీట్ చేసింది. దీనికి ఒక వీడియోను కూడా యాడ్ చేసింది. బీజేపీ సభలో గూండాయిజం చేస్తోందని, ఇంతకాలం బీజేపీ చేసిన అవినీతిని త్వరలోనే బయటపెడతామని ఆప్ నేతలు అంటున్నారు. బుధవారం జరిగిన మేయర్ ఎన్నికలో ఆప్ అభ్యర్థి షెల్లీ ఒబెరాయ్, బీజేపీ అభ్యర్థి రేఖా గుప్తాపై 34 ఓట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో రెండు నెలలుగా కొనసాగుతున్న మేయర్ ఎన్నిక సంక్షోభానికి తెరపడింది.