Meta Layoffs: మళ్లీ ఉద్యోగాల కోతకు రెడీ అవుతున్న మెటా.. వేల మంది ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధం

తమ కంపెనీకి చెందిన వేల మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు మెటా రెడీ అవుతోంది. మొత్తం ఉద్యోగుల్లో 11,000 మందికిపైగా సిబ్బందిని లేదా 13 శాతం ఉద్యోగుల్ని తొలగిస్తామని మెటా గత ఏడాది ప్రకటించింది. మెటా సంస్థ ఏర్పాటైన 18 ఏళ్లలో ఈ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించడం ఇదే మొదటిసారి.

Meta Layoffs: మళ్లీ ఉద్యోగాల కోతకు రెడీ అవుతున్న మెటా.. వేల మంది ఉద్యోగులపై వేటుకు రంగం సిద్ధం

Meta Layoffs: ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా మళ్లీ భారీ స్థాయిలో ఉద్యోగాల కోతకు సిద్ధమవుతోంది. తమ కంపెనీకి చెందిన వేల మంది ఉద్యోగుల్ని తొలగించేందుకు రెడీ అవుతోంది. మొత్తం ఉద్యోగుల్లో 11,000 మందికిపైగా సిబ్బందిని లేదా 13 శాతం ఉద్యోగుల్ని తొలగిస్తామని మెటా గత ఏడాది ప్రకటించింది.

Gurugram: కోవిడ్ భయంతో మూడేళ్లుగా ఇంటి నుంచి బయటకు రాని తల్లీకొడుకు.. మూడేళ్లుగా ఎలా ఉన్నారంటే

మార్కెట్లు బలహీనమవడం, వ్యాపారాభివృద్ధి లేకపోవడం, యాడ్ రెవెన్యూ తగ్గిపోవడం, నిర్వహణా వ్యయం పెరగడం వంటి కారణాల వల్ల ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు మెటా తెలిపింది. దీనికి అనుగుణంగానే మెటా సంస్థ ఇటీవల పలువురు ఉద్యోగుల్ని తొలగించింది. ఇప్పుడు మరో దశలో వేల మందిని తొలగించాలని నిర్ణయించింది. అంతేకాదు.. పలువురు ఉద్యోగుల్ని ఒక స్థాయి నుంచి మరో స్థాయికి మార్చనుంది. ఉన్నత స్థానాల్లో ఉన్న వారిని కింది స్థాయి విభాగాల్లోకి మార్చనుంది. మెటా సంస్థ ఏర్పాటైన 18 ఏళ్లలో ఈ స్థాయిలో ఉద్యోగుల్ని తొలగించడం ఇదే మొదటిసారి.

Karnataka: ఫ్యాక్టరీల్లో రాత్రిపూట మహిళలకు పని.. వారానికి నాలుగు రోజులే డ్యూటీ.. కొత్త చట్టం తెచ్చిన కర్ణాటక

ఇటీవల కంపెనీ షేర్లు కూడా భారీగా పతనమవుతున్నాయి. గత బుధవారం రోజే కంపెనీ షేర్లు 1.2 శాతం పడిపోయాయి. కంపెనీ విలువ కూడా గణనీయంగా తగ్గిపోయింది. గతంలో ఒక దశలో 1 ట్రిలియన్‌గా ఉన్న కంపెనీ విలువ, ఇప్పుడు 446 బిలియన్లుగానే ఉంది. ఈ నేపథ్యంలో మెటా అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనిలో భాగంగా ఉద్యోగుల్ని తొలగిస్తోంది. ఆఫీసుల్ని తగ్గిస్తోంది. ఆఫీసు నిర్వహణా వ్యయాల్లో కోత పెడుతోంది. ఈ ఏడాది కొత్తగా ఎలాంటి నియామకాలు చేపట్టకూడదని నిర్ణయించుకుంది. ఇటీవలి కాలంలో అనేక టెక్ కంపెనీలు ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. మొత్తంగా పలు కంపెనీలు లక్ష మందికిపైగా ఉద్యోగుల్ని ఇంటికి పంపించాయి. మరిన్ని కోతలు కొనసాగుతున్నాయి.