PG Medico Health Update: కాస్త మెరుగుపడ్డ ప్రీతి ఆరోగ్యం.. నాణ్యమైన వైద్యం అందిస్తామన్న మంత్రి సత్యవతి రాథోడ్

నిన్నటితో పోలిస్తే ప్రీతి ఆరోగ్యంలో కదలిక వచ్చినట్లుగా తెలుస్తోంది. డాక్టర్స్ గట్టిగా తట్టిలేపితే కళ్లు తెరిచింది. కళ్లు కాస్త కదిలిస్తోంది. ఈ రోజు కొంచెం మెరుగ్గా ఊపిరి తీసుకుంటుందని డాక్టర్లు ఆశిస్తున్నారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్ కూడా వైద్య చికిత్స గురించి హామీ ఇచ్చారు.

PG Medico Health Update: కాస్త మెరుగుపడ్డ ప్రీతి ఆరోగ్యం.. నాణ్యమైన వైద్యం అందిస్తామన్న మంత్రి సత్యవతి రాథోడ్

PG Medico Health Update: వరంగల్ కేసీఎంలో ఆత్మహత్యాయత్నం చేసిన మెడికో ప్రీతి ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగైనట్లు ఆమె తండ్రి నరేందర్ తెలిపారు. గురువారంతో పోలిస్తే శుక్రవారం ప్రీతి ఆరోగ్యం స్వల్పంగా మెరుగైందని ఆయన అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రీతికి సంబంధించిన వివరాల్ని వెల్లడించారు.

Marriage In Hospital: ఆస్పత్రిలోనే పెళ్లి చేసుకున్న జంట.. కారణమేంటంటే..

‘‘నిన్నటితో పోలిస్తే ప్రీతి ఆరోగ్యంలో కదలిక వచ్చినట్లుగా తెలుస్తోంది. డాక్టర్స్ గట్టిగా తట్టిలేపితే కళ్లు తెరిచింది. కళ్లు కాస్త కదిలిస్తోంది. ఈ రోజు కొంచెం మెరుగ్గా ఊపిరి తీసుకుంటుందని డాక్టర్లు ఆశిస్తున్నారు. ప్రీతి ఆరోగ్య పరిస్థితి తెలుసుకునేందుకు వచ్చిన మంత్రి సత్యవతి రాథోడ్ కూడా వైద్య చికిత్స గురించి హామీ ఇచ్చారు. ఎంత ఖర్చైనా వైద్యం చేయిస్తామన్నారు. నిందితుడు, ఆరోపణలు ఎదుర్కొంటున్న సైఫ్‌ను అరెస్టు చేసినట్లుగా ప్రచారం మాత్రమే జరుగుతోంది. నిజంగా సైఫ్‌ను అరెస్టు చేస్తే అతడ్ని ఎందుకు మీడియా ముందుకు తీసుకు రావడం లేదు. ఈ విషయంలో మాకు న్యాయం జరగాలి’’ అని ప్రీతి తండ్రి నరేందర్ అన్నారు.

US Winter Storm: అమెరికాలో మంచు తుఫాను బీభత్సం.. పది లక్షల మందికి పవర్ కట్.. వేలాది విమానాలు రద్దు

మరోవైపు మంత్రి సత్యవతి రాథోడ్ నిమ్స్‌ను సందర్శించి, అక్కడ చికిత్స పొందుతున్న ప్రీతి ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్నారు. ‘‘ప్రీతి ఆరోగ్యం కొంత మెరుగుపడుతోంది. డాక్టర్ల బృందంతో కలిసి ప్రీతిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు తట్టి లేపితే ఒక్కసారి కనురెప్పలు కదిలించింది. ప్రీతికి మెరుగైన వైద్యం అందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే నిమ్స్ ఆస్పత్రి డైరెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు. ఎంత ఖర్చైనా ప్రభుత్వమే భరించి, నాణ్యమైన వైద్యం అందిస్తుంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిపై ఇప్పటికే క్రిమినల్ కేసు నమోదైంది.

కాబట్టి దీనిపై వరంగల్ సీపీ తప్పనిసరిగా చర్యలు తీసుకుంటారు. నిందితులు ఎలాంటివారైనా కఠిన చర్యలు తప్పవు. స్త్రీలకు హాస్టళ్లలో రక్షణ ఉంటుంది’’ అని సత్యవతి రాథోడ్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రీతి ఆరోగ్యం కాస్త మెరుగైనప్పటికీ, ఆమె పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని వైద్యులు తెలిపారు. ఆమెకు ఎక్మో, వెంటిలేటర్ ద్వారా చికిత్స కొనసాగుతోంది.