US Winter Storm: అమెరికాలో మంచు తుఫాను బీభత్సం.. పది లక్షల మందికి పవర్ కట్.. వేలాది విమానాలు రద్దు

వాషింగ్టన్ నుంచి న్యూ ఇంగ్లండ్ వరకు మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. దేశ వ్యాప్తంగా 9,70,000 మందికిపైగా పౌరులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై సగటున 18 అంగుళాలకు పైగా మంచు పేరుకుపోయింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో చల్లటిగాలులు వీస్తున్నాయి.

US Winter Storm: అమెరికాలో మంచు తుఫాను బీభత్సం.. పది లక్షల మందికి పవర్ కట్.. వేలాది విమానాలు రద్దు

US Winter Storm: అమెరికాను మంచు తుఫాను వణికిస్తోంది. అమెరికాలోని అనేక రాష్ట్రాలు మంచులో చిక్కుకున్నాయి. భారీగా కురుస్తున్న మంచు అక్కడి జనజీవనాన్ని అతలాకుతలం చేస్తోంది. ఇల్లినాయిస్, ఇండియానా, మిచిగాన్, న్యూయార్క్, విస్కాన్సిన్ వంటి ప్రాంతాలు పూర్తిగా మంచు తుఫానుతో విలవిలలాడుతున్నాయి.

Ajay Banga: వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి.. అజయ్ బంగాను ప్రతిపాదించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్

అమెరికా వ్యాప్తంగా లక్షలాది మంది ప్రజలు మంచు ప్రభావానికి గురయ్యారు. అందరూ ఇంట్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి. వాషింగ్టన్ నుంచి న్యూ ఇంగ్లండ్ వరకు మంచు ప్రభావం ఎక్కువగా ఉంది. దేశ వ్యాప్తంగా 9,70,000 మందికిపైగా పౌరులకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. రోడ్లపై సగటున 18 అంగుళాలకు పైగా మంచు పేరుకుపోయింది. గంటకు 80 కిలోమీటర్ల వేగంతో చల్లటిగాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు అనేక ప్రాంతాల్లో మైనస్ 40 డిగ్రీలకు పడిపోయాయి. దీంతో రోడ్డు రవాణా మొత్తం నిలిచిపోయింది. మంచు తుఫాను కారణంగా అనేక రాష్ట్రాల్లో విమాన సర్వీసులు రద్దయ్యాయి.

Chhattisgarh: చత్తీస్‌గఢ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. వ్యాన్‌ను ఢీకొన్న ట్రక్కు.. 11 మంది మృతి

దాదాపు 2,000కు పైగా విమానాలు రద్దు కాగా, 15,000 విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. మంచు ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మిచిగాన్ పరిధిలో సహాయక చర్యల్లో పాల్గొన్న ఒక వాలంటీర్ ప్రాణాలు కోల్పోయాడు. మంచు తొలగిస్తుండగా, విద్యుత్ వైరు తెగి మంచులో పడింది. దీంతో అతడు కరెంట్ షాక్ తగిలి ప్రాణాలు కోల్పోయాడు. మిన్నియా పోలిస్ ప్రాంతంలో గంటకు 2.5-5 సెంటీమీటర్ల మేర మంచు కురుస్తోంది.

ఇక్కడ 2.9 మిలియన్ల ప్రజలు మంచు ధాటికి ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడి స్కూళ్లు, విద్యా సంస్థలు మూసేశారు. 20,000కుపైగా ఇండ్లు, వ్యాపార సముదాయాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అమెరికాలోని ఇలాంటి కొన్ని రాష్ట్రాల్లో విపరీతంగా మంచు కురుస్తుంటే, ఒహియో వ్యాలీ, దక్షిణాది ప్రాంతాలు మాత్రం ఎండ వేడిమితో అల్లాడిపోతున్నాయి.