Ajay Banga: వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి.. అజయ్ బంగాను ప్రతిపాదించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్

భారత మూలాలు కలిగిన అజయ్ బంగా వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. పలు కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన జనరల్ అట్లాంటిక్ అనే సంస్థకు వైస్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2009లో అజయ్ బంగా మాస్టర్ కార్డ్ అధ్యక్షుడిగా, సీఓఓగా ఎంపికయ్యారు.

Ajay Banga: వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా భారత సంతతి వ్యక్తి.. అజయ్ బంగాను ప్రతిపాదించిన అమెరికా అధ్యక్షుడు బైడెన్

Ajay Banga: మాస్టర్ కార్డ్ మాజీ సీఈవో అజయ్ బంగాను వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా ప్రతిపాదిస్తూ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నిర్ణయం తీసుకున్నారు. అజయ్ బంగా భారత సంతతి వ్యక్తి కావడం విశేషం. ప్రస్తుతం వరల్డ్ బ్యాంక్ అధ్యక్షుడిగా కొనసాగుతున్న డేవిడ్ మాల్పస్ త్వరలో పదవి నుంచి వైదొలుగుతానని ప్రకటించారు.

Blast One Killed : నల్లగొండ జిల్లాలో బ్లాస్ట్.. ఒకరు మృతి

ఆయన పదవీ కాలం మరో ఏడాది ఉన్నప్పటికీ ముందుగానే బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఈ ఏడాది జూన్‌లో ఆయన వైదొలుగుతారు. ఈ నేపథ్యంలో ఈ పదవికి అజయ్ బంగాను గురువారం బైడెన్ నామినేట్ చేశారు. ‘‘వాతావరణ మార్పులతోపాటు మన కాలంలో ఎదురైన క్లిష్టమైన సవాళ్లను ఎదుర్కునేందుకు ప్రైవేటు, ప్రభుత్వ వనరులను ఉపయోగించుకోవడంలో బంగాకు మంచి అనుభవం ఉంది’’ అని బైడెన్ తన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రపంచబ్యాంకులో అమెరికా అతిపెద్ద వాటాదారుగా ఉంది. అందుకే ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడి ఎంపికలో అమెరికా పాత్ర చాలా కీలకం.

Chandrababu slams Jagan: మధ్యంతర ఎన్నికలకు జగన్ సిద్ధమవుతున్నారు: చంద్రబాబు

భారత మూలాలు కలిగిన అజయ్ బంగా వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. పలు కీలక బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన జనరల్ అట్లాంటిక్ అనే సంస్థకు వైస్ ఛైర్మన్‌గా కొనసాగుతున్నారు. 2009లో అజయ్ బంగా మాస్టర్ కార్డ్ అధ్యక్షుడిగా, సీఓఓగా ఎంపికయ్యారు. ఆ తర్వాత కొంతకాలానికే అంటే ఏప్రిల్ 2010లో మాస్టర్ కార్డ్ అధ్యక్షుడిగానే కాకుండా, సీఈఓగానూ నియమితులయ్యారు. అంతకుముందు సిటీ గ్రూప్ సంస్థకు చెందిన ఆసియా పసిఫిక్ వ్యవహరాలు చూసేవారు. ఇలా ఆర్థిక సంబంధమైన అనేక కీలక బాధ్యతల్ని అజయ్ బంగా విజయవంతంగా నిర్వర్తించారు.

అజయ్ బంగా మహారాష్ట్ర, పూనేలో జన్మించారు. తర్వాత ఢిల్లీ, అహ్మదాబాద్‌లో విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వ్యాపారవేత్తగానే కాకుండా, పలు కంపెనీల్లో ఉన్నత పదవుల్లో పని చేశారు.