Medico Preethi Case : ఇప్పటివరకు ఆ రిపోర్టులు మాకు ఎందుకివ్వలేదు, ఆ గది ఎందుకు తెరిచారు?- ప్రీతి తమ్ముడు పృథ్వీ

Medico Preethi Case: ఎందుకు రక్తం ఎక్కించారు? కడుపుకు ఆపరేషన్ ఎందుకు చేశారు? ఇంతవరకు హెచ్ఓడీ, ప్రిన్సిపాల్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు.

Medico Preethi Case : ఇప్పటివరకు ఆ రిపోర్టులు మాకు ఎందుకివ్వలేదు, ఆ గది ఎందుకు తెరిచారు?- ప్రీతి తమ్ముడు పృథ్వీ

Medico Preethi Case (Phto : Google)

Updated On : April 20, 2023 / 12:35 AM IST

Medico Preethi Case : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన వరంగల్ ఎంజీఎం డాక్టర్ ప్రీతి మృతి కేసులో జరుగుతున్న దర్యాఫ్తు విధానంపై ప్రీతి తమ్ముడు పృథ్వీ హాట్ కామెంట్స్ చేశాడు. ప్రీతి మృతి కేసులో దర్యాప్తు జరుగుతున్న తీరు సరిగా లేదన్నాడు పృథ్వీ. ఇప్పటివరకు పోస్టుమార్టం, ఫోరెన్సిక్ రిపోర్ట్ మాకు ఎందుకివ్వలేదని ప్రశ్నించాడు. ఇంత ఆలస్యం కావడా‌నికి కారణాలేంటో చెప్పాలని నిలదీశాడు.

సంఘటన జరిగిన రూమ్ ను ఎందుకు అన్ సీజ్ చేశారని పృథ్వీ ప్రశ్నించాడు. ఇప్పటివరకు ఒక ట్రయల్ కూడా కాకుండా గది ఎలా ఓపెన్ చేస్తారని అడిగాడు. ఈ కేసులో ఇంతవరకు హెచ్ఓడీ, ప్రిన్సిపాల్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశాడు. ప్రీతి మృతికి కార్డియాక్ అరెస్ట్ అని ఇండైరెక్ట్ గా చెప్పారు.. అటువంటప్పుడు ఎందుకు రక్తం ఎక్కించారు? కడుపుకు ఆపరేషన్ ఎందుకు చేశారు? అని సందేహాలు వ్యక్తం చేశాడు.

Also Read..Medico Preethi Case : డాక్టర్ ప్రీతి కేసులో కీలక పరిణామం, అతడికి బెయిల్ మంజూరు

సీపీపై మాకు నమ్మకం ఉందన్న పృథ్వీ.. దర్యాప్తు సరిగా చేయాలని కోరాడు. పీజీలపై ఒత్తిడి తెచ్చి మా అక్కకు వ్యతిరేకంగా ప్రదర్శనలు చేయించారని ఆరోపించాడు. ఇప్పటికైనా నిష్పాక్షికంగా దర్యాఫ్తు చేయాలని పోలీసులను కోరాడు ప్రీతి తమ్ముడు పృథ్వీ.

మరోవైపు ప్రీతి మృతి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు డాక్టర్ సైఫ్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది న్యాయస్థానం. 10 వేల రూపాయలు ఇద్దరి పూచీకత్తుతో బెయిల్ ఇచ్చింది.

Also Read..Medico Student Preeti : సైఫ్ వేధింపులపై ఫోన్ లో తల్లితో చెప్పి బాధపడిన ప్రీతి

16 వారాల పాటు ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం కోర్టులో హాజరుకావాలని ఆదేశాలు జారీ చేసింది. కేసు విచారణ ఉన్న నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడ్డా, సాక్ష్యాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించినా.. బెయిల్ రద్దు చేస్తామని హెచ్చరించారు న్యాయమూర్తి. డాక్టర్ సైఫ్ గురువారం జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.