Medico Preethi Case : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన మెడికో ప్రీతి కేసులో విచారణ కొనసాగుతోంది. మరోవైపు తన కూతురు ప్రీతిది ఆత్మహత్య కాదు హత్యే అంటున్నారు తండ్రి నరేందర్. ప్రీతి మరణంపై సమగ్ర విచారణ జరగాలని డీజీపీని కోరారు నరేందర్. నిందితులకు కఠిన శిక్ష పడాలని డిమాండ్ చేశారు. ప్రీతి మరణంపై అనుమానాలు ఉన్నాయని, తమకు న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయిస్తామన్నారు ప్రీతి తల్లి.
ప్రీతిది హత్య కేసుగా నమోదు చేసి దర్యాఫ్తు చేయాలని డిమాండ్ చేశారు కుటుంబసభ్యులు. సోమవారం ప్రీతి తల్లిదండ్రులు డీజీపీని కలిశారు. ప్రీతిది ఆత్మహత్య కాదని, ఆమెది హత్యేనని తాము తొలి నుంచి చెబుతున్నామన్నారు ప్రీతి తండ్రి నరేందర్. నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని డీజీపీని కోరినట్లు చెప్పారు నరేందర్. ప్రీతి కేసులో న్యాయం జరిగేలా చూడాలని డీజీపీని కోరారు ప్రీతి తండ్రి నరేందర్.(Medico Preethi Case)
Also Read..Medico Preeti Case : ప్రీతి డెత్ కేసులో కొత్త కోణాలు.. కీలకంగా మారిన డా.స్మృతి అభిప్రాయం
మరోవైపు మట్టెవాడ పోలీసులు ఇంకోసారి ప్రీతి తల్లిదండ్రుల స్టేట్ మెంట్ రికార్డ్ చేశారు. రిపోర్టుపై అనుమానాలు వ్యక్తమవడంపై డాక్టర్లు వివరణ ఇస్తున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న ప్రీతికి రక్తం ఎక్కించిన తర్వాత నమూనాలు తీసుకోవడంతో టాక్సికాలజీ రిపోర్టు సరిగా రాకపోవచ్చంటున్నారు డాక్టర్లు. ఘటన జరిగిన వెంటనే ఎంజీఎం డాక్టర్లు ప్రీతి రక్త నమూనాలు సేకరించి ఉంటే, టాక్సికాలజీ రిపోర్టు సరైన ఫలితం వచ్చేదని చెబుతున్నారు.
అంతకుముందు వరంగల్ కోర్టు వద్ద హైడ్రామా కొనసాగింది. నిందితుడు డాక్టర్ సైఫ్ ను కోర్టులో హాజరుపరిచే సమయంలో వ్యూహాత్మకంగా వ్యవహరించారు పోలీసులు. మీడియా కంటపడకుండా కోర్టు వెనుక గేటు నుంచి సైఫ్ ను జడ్జి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. మొత్తం 3 వెహికల్స్ లో కోర్టుకు చేరుకున్న పోలీసులు మెయిన్ గేట్ నుంచి రెండు వెహికల్స్, వెనుక గేటు నుంచి మరో వెహికల్ లో సైఫ్ ని తీసుకెళ్లారు.
విచారణ అనంతరం డాక్టర్ సైఫ్ ను జ్యుడీషియల్ రిమాండ్ కు ఆదేశించారు జడ్జి. మరో రెండు రోజులు సైఫ్ ను కస్టడీకి కోరారు పోలీసులు. కస్టడీ పిటిషన్ పై విచారణను వాయిదా వేశారు జడ్జి. పోలీస్ ఎస్కార్ట్ మధ్య డాక్టర్ సైఫ్ ను ఖమ్మం జైలుకి తరలించారు.(Medico Preethi Case)
వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో పీజీ అనస్థీషియా ఫస్టియర్ చదువుతున్న ప్రీతి ఫిబ్రవరి 22న హానికారక ఇంజెక్షన్ తీసుకోవడం ద్వారా ఆత్మహత్యకు యత్నించింది. తొలుత ఆమెకు వరంగల్ ఎంజీఎంలో చికిత్స అందించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ నిమ్స్‌కు తరలించారు. ఆమెను బతికించేందుకు ప్రత్యేక వైద్య బృందం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. అయినా, ఫలితం లేకపోయింది.
తమ కూతురు ప్రాణాలతో తిరిగి వస్తుందని ఆశించిన తల్లిదండ్రులు.. ఆమె మృతితో గుండె పగిలేలా విలపించారు. తమ కూతురు పెద్ద ఆశయంతో ఉండేదని, ఆమెతో పాటు ఆ ఆశయం కూడా చనిపోయిందని కన్నీళ్లు పెట్టుకున్నారు. తన కుమార్తె ప్రీతిది ఆత్మహత్య కాదని, హత్యేనని ఆమె తండ్రి నరేందర్ ఆరోపించారు. ప్రీతికి ఎవరో ఇంజక్షన్ ఇచ్చారని, ఈ కోణంలో పోలీసులు దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రీతి మరణానికి గల కారణాలు తెలపాలన్నారు.
Also Read..Medico Preeti Case : మెడికో ప్రీతి మృతి కేసులో మరో కీలక ఆధారం లభ్యం
సెకండ్ ఇయర్ విద్యార్థి సైఫ్ తనను వేధిస్తున్నాడంటూ తల్లిదండ్రులకు ప్రీతి ఫిబ్రవరి 18న చెప్పింది. ప్రీతి ఆత్మహత్యయత్నం చేసుకున్న రోజు రాత్రి విధుల్లో ఉంది. తెల్లవారుజామున 3 గంటల వరకు డ్యూటీ చేసింది. అనంతరం ఆత్మహత్యకు యత్నించింది.
ఆత్మహత్యకు యత్నించే కంటే ముందు ప్రీతి తన తల్లితో మాట్లాడింది. సైఫ్ తనతో పాటు చాలా మంది జూనియర్లని వేధిస్తున్నాడని వాపోయింది. సీనియర్లు అంతా ఒకటేనని చెప్పింది. సైఫ్ వేధింపులు రోజురోజుకు మితిమీరిపోతున్నాయని తల్లితో మొర పెట్టుకుంది. తాను సైఫ్‌పై ఫిర్యాదు చేస్తే సీనియర్లందరూ ఒకటైపోయి తనను ఏం చేస్తారో అంటూ కన్నీటిపర్యంతమైంది.