Rain Alert : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో నేడు దంచికొట్టనున్న వానలు.. హెచ్చరికలు జారీ
Rain Alert : తెలంగాణలో భిన్న వాతావరణం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ఈ క్రమంలో వాతావరణ శాఖ కీలక విషయాన్ని చెప్పింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
- Harishth Thanniru
- Updated on- April 19, 2026 / 08:53 AM IST
Rain Alert
- తెలంగాణ ప్రజలకు బిగ్ అలర్ట్..
- ఇవాళ పలు జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షాలు
- వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ
Rain Alert : తెలంగాణలో భిన్న వాతావరణం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పలు ప్రాంతాల్లో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. 44డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్న క్రమంలో ప్రజలు బయటకు రావాలంటే జంకుతున్నారు. ఇదే సమయంలో పలు జిల్లాల్లో ఇవాళ్టి నుంచి ఈనెల 26వ తేదీ వరకు ఉరుములు, మెరుపులతోపాటు భారీ ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఈ మేరకు హెచ్చరికలు జారీ చేసింది.
Also Read : MMTS Trains : హైదరాబాద్ వాసులకు అదిరిపోయే శుభవార్త.. ఆ ట్రైన్స్‌లో ఉచిత ప్రయాణం..
ఇవాళ అదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం వంటి ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. వర్షాలు కురిసే సమయంలో ఉరుములు, మెరుపులతోపాటు 30 నుంచి 40కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
మరోవైపు.. అకాల వర్షాల వల్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. రైతులు రబీలో సాగు చేసిన వరి, మొక్కజొన్న, మిర్చి తదితర పంటలు కోత దశకు వచ్చాయి. పలు ప్రాంతాల్లో పంట ఉత్పత్తులు కల్లాల్లో ఉన్నాయి. దీంతో వారం రోజుల పాటు రాష్ట్రంలో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు తమ పంట ఉత్పత్తులు కాపాడుకునేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. మరోవైపు.. వర్షాలు, ఈదురుగాలుల సమయంలో ప్రజలు బయటకు వెళ్లొద్దని, చెట్లు, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్‌లు వద్ద ఉండొద్దని సూచించారు.
వర్షం సూచనల నేపథ్యంలోనూ రాష్ట్రంలో ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటోందని, ఆ సమయాల్లో బయటకు వెళ్లే ప్రజలు ఎండ దెబ్బకు గురికాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.
