Rain Alert : తెలంగాణకు రెయిన్ అలర్ట్.. ఈ జిల్లాల్లో నేడు భారీ వర్షాలు..! వాతావరణశాఖ హెచ్చరికలు జారీ..
Rain Alert : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే, రోబోయే మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది.
Rain Alert
- తెలంగాణలో మూడ్రోజులు వర్షాలు
- ఎల్లో అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
- ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు పడే చాన్స్
Rain Alert : తెలంగాణలోని పలు ప్రాంతాల్లో గత కొద్దిరోజులుగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. అయితే, రోబోయే మూడు రోజులు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
Also Read : Beer Price Hike : మందు బాబులకు బిగ్అలర్ట్.. బీర్లు తాగుతున్నారా..? ఈ విషయాలు తప్పకుండా తెలుసుకోండి..
హైదరాబాద్ వాతావరణ శాఖ చెప్పిన వివరాల ప్రకారం.. నేటి నుంచి 30వ తేదీ వరకు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో పాటు పలు ప్రాంతాల్లో పిడుగులు కూడా పడే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు తోడు గంటకు 30 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
శని, ఆది, సోమవారాల్లో జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, అదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్ధిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది.
పలు ప్రాంతాల్లో మధ్యాహ్నం వేళల్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ.. సాయంత్రం సమయాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి ఉరుములుమెరుపులతో కూడిన వర్షం కురిసింది. వచ్చే మూడు రోజులు కూడా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.
ముఖ్యంగా ఈదురుగాలులతో కూడిన వర్షం పడే సమయంలో చెట్ల కింద, హోర్డింగ్లు, విద్యుత్ స్తంభాల వద్ద.. విద్యుత్ తీగలు ఉన్న ప్రాంతాల్లో ఉండొద్దని అధికారులు సూచించారు.
